నీతో నాది గత జన్మబంధమంటూ .. ఎన్ఆర్ఐ మహిళపై యోగా టీచర్ అత్యాచారం

ఎన్ఆర్ఐ మహిళపై అత్యాచారం చేసిన ఆరోపణలపై కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలో యోగా టీచర్‌ను( yoga teacher ) పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు.

గత జన్మలో మనిద్దరికి సంబంధం ఉందంటూ యోగా గురు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఆమె పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంది.

నిందితుడిని చిక్కమగళూరులో కేవల ఫౌండేషన్ నిర్వహిస్తున్న ప్రదీప్ ఉల్లాల్( Pradeep Ullal ) (54)గా పోలీసులు గుర్తించారు.అతని వద్ద ఆన్‌లైన్‌లో యోగా శిక్షణ తీసుకుంటున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ప్రదీప్‌ను అరెస్ట్ చేశారు.

తన కుటుంబం పంజాబ్‌కు ( Punjab )చెందినదని, 2000 సంవత్సరం నుంచి తాము అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటున్నామని బాధితురాలు పేర్కొంది.2021, 2022లలో ప్రదీప్ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని మహిళ ఫిర్యాదులో తెలిపింది.గత జన్మలో నీతో నాకు సంబంధం ఉందని నమ్మించి ఆధ్యాత్మికత, దైవిక ప్రేమ వంటి మాటలు చెప్పి తనపై ప్రదీప్ ఉల్లాల్ లైంగిక దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదులో తెలిపింది.

ఈ క్రమంలో తాను గర్భం దాల్చగా.చివరికి గర్భస్రావం అయ్యిందని వెల్లడించింది.

Advertisement

ప్రదీప్ ఉల్లాల్ గతంలో దుబాయ్‌లో పనిచేసి ప్రస్తుతం బెంగళూరులో( Bangalore ) స్థిరపడ్డాడు.దుబాయ్‌లో ఉన్న సమయంలోనే అక్కడ యోగా తరగతులను ప్రారంభించాడని చెబుతారు.ఇండియాకు తిరిగి రాగానే 2010లో చిక్కమగళూరు జిల్లాలో మూడు ఎకరాల భూమిని కొనుగోలు చేసి , యోగా తరగతులను ప్రారంభించాడని పోలీసులు తెలిపారు.

ఉల్లాల్ హిమాలయ యాత్రలు, పక్షులను చూడటం తదితర కార్యక్రమాలకు ప్రజలను తీసుకెళ్లేవారని చెప్పారు.అతని కార్యకలాపాలు ప్రధానంగా ఆన్‌లైన్‌లో ఉండగా.చాలా మంది విద్యార్ధులు అతనికి శిష్యులు ఉన్నారని అధికారులు వెల్లడించారు.

ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ప్రదీప్ ఉల్లాల్‌ నిజంగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారా లేదా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

నేరం నిజమని తేలితే ఆయనను కఠినంగా శిక్షిస్తామని పోలీసులు చెబుతున్నారు.

పెద్దాయన ఎలా ఉన్నారు.. ఆరోగ్యం బాగుందా, బ్రిటన్ రాజుతో భారతీయుడి సంభాషణ
Advertisement

తాజా వార్తలు