జగన్ కి భారీ షాక్ : టీడీపీ లోకి మరొక ఎమ్మెల్యే

వైకాపా లీడర్ జగన్ కి చుక్కలు చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు.తన ఆపరేషన్ ఆకర్ష్ తో మరొక వికెట్ ని కొల్ల గొట్టేసారు చంద్రబాబు నాయుడు.

నారా లోకేష్ ప్లానింగ్ గా అభివర్ణిస్తున్నా ఇదంతా నిజానికి చంద్రబాబు కీ ప్లానింగ్ అని ఇట్టే చెప్పచ్చు.మార్చ్ 4 న పాత పట్నం ఎమ్మెల్యే వెంకట రమణ వైకాపా కి టాటా చెప్పి టీడీపీ లోకి రాబోతున్నారు.

ఈ విషయం ఆయనే స్వయంగా ప్రకటించడం గమనార్హం.వైకాపా నుంచి ఇప్పుడు ఏడవ వికెట్ పడినట్టు అయ్యింది.

ఇదివరకు తెలుగుదేశం తరఫునే పనిచేసిన వెంకటరత్నం దాదాపు పది సంవత్సరాల రాజకీయ అనుభవం తరవాత టీడీపీ ని వీడి వైకాపా కి వెళ్లారు.

Advertisement
జగన్ కొత్తగా పార్టీ పెట్టినప్పుడు ఆయన టీడీపీ ని వీడారు.

పదేళ్ళు టీడీపీలో పనిచేసిన అనుభవం వుందనీ, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వైఎస్సార్సీపీలో చేరాననీ, తిరిగి సొంత గూటికి చేరుతుండడం ఆనందంగా వుందని ఎమ్మెల్యే వెంకటరమణ వ్యాఖ్యానించడం గమనార్హం.షరామామూలుగానే, ఈయనా నియోజకవర్గం అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నట్లు సెలవిచ్చారు.

ఒక పక్క టీడీపీ బెదిరింపు రాజకీయాలకి పాల్పడుతోంది అని జగన్ ఆరోపిస్తున్నారు.

కొలెస్ట్రాల్ ను తగ్గించే లెమన్ గ్రాస్.. ఇంతకీ ఎలా తీసుకోవాలి..?
Advertisement

తాజా వార్తలు