ఫోన్ ట్యాపింగ్ పై కేంద్రానికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశా - కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

నెల్లూరు: రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రెస్ మీట్ కామెంట్స్.ఫోన్ ట్యాపింగ్ పై కేంద్రానికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశా.

రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలి అనుకుంటే ప్రభుత్వమే కేంద్రానికి లేఖ రాయడానికి ఉలికిపాటు ఎందుకు.మా పార్టీ ఎమ్మెల్యేనే ఆరోపించారు దర్యాప్తు చేయాలి అని కేంద్రానికి లేఖ రాయాల్సింది పోయి ఏదోదో చేస్తున్నారు.

కొండని త్రవ్వి ఎలుకను బయటకి తీసినట్లు ప్రవర్తిస్తున్నారు.రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, హైకోర్టు జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి.

విచారణ జరిగితే మిగిలిన ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ లు చేశారో బయటపడుతాయని భయమా.నా మిత్రుడు రామశివారెడ్డి చిత్రంగా మాట్లాడారు.ఆయనకి సజ్జల స్క్రిప్ట్ సరిగా ఇచ్చినట్లు లేదు.5 నెలలుగా కాల్ హిస్టరీ ఉండేది ఏంటి.4వ తేదీ ఆడియో డిలీట్ ఎందుకు చేశారు.సజ్జలకి చాలా థాంక్స్.

Advertisement

మీ స్క్రిప్ట్ వల్ల ప్రజలకి ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నిర్ధారణ అయ్యింది.నేను రాజకీయల్లోకి వచ్చిందే పోరాటాల్లోనుంచే.

ఆల్మట్టి కాంట్రాక్టర్ గా రాలేదు.ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు జాతకాలు నేర్చుకున్నారా.? గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తిరిగి నన్ను, జగన్ గారిని నీచాతి నీచంగా తిట్టి వైసీపీలోకి వెళ్లిపోయారు.అలాంటి మీరా నా గురించి మాట్లాడేది.?

గతంలోలాగా టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లినట్లుగా.ఈ సారి వైసీపీ నుంచి టీడీపీలోకి వేళ్ళను అని చెప్పగలవా ఆదాల.మీరు కానీ.

మీ కుటుంబ సభ్యులు కానీ రూరల్ వైసీపీ నుంచి పోటీ చేస్తానని ప్రకటించండి.మీ గురించి ఎక్కడా మాట్లాడను.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

అధికార పార్టీ నుంచి బీఫామ్ తీసుకుని పరుగో పరుగు అని నేను పరిగెత్తను ఆదాల గారు.నాకు పార్టీలో నచ్చలేదు, కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుసు.

Advertisement

అయినా నీతిగా నిజాయితీగా బయటకి వచ్చాను.నాది మా కార్యకర్తలు, నా అనుచరులది రాజకీయ బంధం కాదు.

మీరు ఎక్కడున్నా బాగుండాలి కోరుకుంటా.మరో 6 నెలల తర్వాత రూరల్ లో చిత్రాలు విచిత్రాలు చూడాల్సి వస్తుంది.

తాజా వార్తలు