ఐటీ పరిశ్రమలు నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణంతో నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే.
ఎన్నికలకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, అలాగే జనసేన దూరంగా ఉండగా.
వైసీపీ తరఫున గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి పోటీలో ఉన్నారు.బీజేపీ కూడా తమ అభ్యర్థి భరత్ కుమార్ యాదవ్ ని బరిలోకి దింపింది.
దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.ఈ క్రమంలో అధికార వైసీపీ, బీజేపీ నాయకులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో అధికార పార్టీ లక్షకు పైగా మెజారిటీ సాధించాలని పట్టుతో ఉంది.ఇందుకోసం గ్రామానికో ఎమ్మెల్యే మండలానికో మంత్రిని బాధ్యతలను అప్పగించి రంగంలోకి దించింది.
ఇక జడ్పీటీసీలు, ఎంపీపీలు, కార్పొరేషన్లు, కమిటీల చైర్మన్లను అందరినీ రంగంలోకి దింపింది.దీన్ని బట్టిచూస్తే వైసీపీ మెజార్టీపై ఎంతలా ఆశలు పెట్టుకుందో అర్థం అవుతోంది.
అయితే మెజార్టీ గనక తగ్గితే ప్రతిపక్షాలకు టార్గెట్ అవుతామన్న ఆందోళన వైసీపీలో మొదలైందని అంటున్నారు.ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత ఉందన్న విమర్శలకు ఈ ఇష్యూ తోడైతే మరింత వ్యతిరేకత జనాల్లోకి వెళ్లే అవకాశం ఉందన్న భయంతో జాగ్రత్తలు పడుతున్నారని అంటున్నారు.
ఈ ఆందోళనకు తోడు ఇటీవల మంత్రులు, ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది.జనాలు లేక రోడ్ షోలు.
సభలు వెలవెల బోయాయి.కొన్ని చోట్ల జనాలు లేక ప్రసంగించకుండానే వెళ్లిపోయారు.
ఇది కూడా కలవరపెట్టే అంశమే.అంతేకాకుండా ప్రచారంలో కొన్ని చోట్ల గ్రూపు రాజకీయాలు చూసి షాకయ్యారు.
తాజాగా నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండల పరిధిలోని చౌట భీమవరం గ్రామంలో రెండు వర్గాలు ప్రచారంలోనే గొడవపడ్డారు.ఘర్షణ వాతావరణం నెలకొని ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు.
దీంతో వైసీపీ అభ్యర్థి విక్రమ్ రెడ్డి ప్రచారం హడావుడిగా ముగించుకుని వెళ్లిపోయారు.
అయితే ఆత్మకూరులో ఘనవిజయం సాధిస్తే ప్రజల మద్దతు తమకే ఉందని చెప్పుకునే అవకాశం వైపీపీకి ఉందని చెప్పుకునే అవకాశం ఉంది.ఈ నేపథ్యంలోనే లక్షకు పైగా మెజారిటీ సాధించి తమ సత్తా చాటాలని వైసీపీ లక్ష్యంతో ఉంది.ఇక ఈ నెల 23న ఆత్మకూరులో ఉప ఎన్నికకు పోలింగ్ జరుగనుంది.
గతం నుంచే నెల్లూరు జిల్లా వైపీకి కంచుకోటగా ఉంది.గత ఎన్నికల్లో జిల్లాలోని మొత్తం 10 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది.
అంతేకాకుండా నెల్లూరు లోక్ సభ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంది.ఇదే నమ్మకంతో ఈ ఎన్నికలో లక్షకుపైగా మెజార్టీ తెచ్చుకుని ప్రజల మద్దతు తమకే ఉందని చెప్పుకునే ప్రయంత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy