ఏపీ సీఎస్‎కు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ..!

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ రాశారు.

సోషల్ మీడియాలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐఅండ్‎పీఆర్‎లో చీఫ్ డిజిటల్ డైరెక్టర్ దేవేందర్ రెడ్డిపై రఘురామ కృష్ణరాజు ఫిర్యాదు చేశారు.

సోషల్ మీడియాలో తనపై అసభ్యకర వ్యాఖ్యలు పోస్టు చేసిన దేవేందర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన పదవిలో కొనసాగుతున్న దేవేందర్ రెడ్డి.

నిబంధనలకు విరుద్ధంగా అసభ్యకర పోస్టులు చేయడం ఏంటని రఘురామ కృష్ణరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.సోషల్ మీడియాలో చేసిన పోస్టులపై స్పందించి వెంటనే విచారణ జరిపించి దేవేందర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ విషయంలో విచారణ జరిపించడంలో అలస్యం వహిస్తే ఐఅండ్‎పీఆర్‎లో చీఫ్ డిజిటల్ డైరెక్టర్ దేవేందర్ రెడ్డికి ప్రభుత్వం, చీఫ్ సెక్రటరీ కార్యాలయం మద్దతు ఉందని భావించి, దీనిపై పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని రఘురామ కృష్ణరాజు లేఖలో పేర్కొన్నారు.

Advertisement
న్యూస్ రౌండప్ టాప్ 20 

తాజా వార్తలు