అతి పెద్ద వ్య‌తిరేక‌త‌.. వైసీపీలో అంతా టెన్ష‌న్‌..!!

ఏపీలో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజకీయ పార్టీలన్నీ ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నాయి.

వైసీసీ ఎమ్మెల్యేలు, మంత్రులు గడప గడపకు మన ప్రభుత్వం అంటూ ఇంటింటికీ ప్రచారం చేస్తున్నారు.

అయితే ఈ కార్యక్రమం వైసీపీ నేతలకు దినదిన గండంగా మారింది.పథకాలు అందుతున్నాయా అని అడగడానికి వెళ్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులను పలు చోట్ల ప్రజలు నిలదీస్తున్నారు.

అసలు పథకాలు ఎక్కడిస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.ఇంతకాలం నియోజకవర్గంలో కనిపించకుండా ఇప్పుడు సడెన్‌గా సంక్షేమ పథకాలు అందుతున్నాయా అంటూ ప్రజలను అడిగేసరికి వైసీపీ నేతలకు చుక్కలు కనిపిస్తున్నాయి.

గతంలో మంత్రుల హోదాలో ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా రాజకీయ ప్రయోజనాలు పొందడమే పనిగా పెట్టుకున్న వాళ్లు.ఇప్పుడు మంత్రి పదవులు పోయేసరికి ఎమ్మెల్యేలుగా ఇంటింటికీ తిరగలేని పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisement

పైగా వాలంటీర్ల వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధులు నియోజకవర్గాల్లో తిరగడం అరుదుగా మారిపోయింది.అన్ని విషయాలను గ్రామ వాలంటీర్లు, వార్డు వాలంటీర్లు మాత్రమే చూసుకుంటున్నారు.

ఇప్పుడు అధిష్టానం ఆదేశాలతో గడప గడపకు వెళ్లాలంటే ప్రజాప్రతినిధులు భయంతో వణికిపోతున్నారు.ఎక్కువ మంది వైసీపీ నేతలు ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నట్లు నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం.

సంక్షేమ పథకాల విషయంలో అమ్మ ఒడి నుంచి రైతు భరోసా వరకు, రేషన్ కార్డుల నుంచి పెన్షన్‌ల వరకు అన్నింటినీ కట్ చేస్తున్నారని ప్రజలు విమర్శలు కురిపిస్తున్నారు.గుంతలు పడిన రోడ్లు, కరెంటు బిల్లులు, పన్ను పోట్లు, గ్రామాల్లో అభివృద్ధి పనులు ఆగిపోవడంపై పలువురు ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నారు.

పలు చోట్ల అయితే ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు మంత్రులు, ఎమ్మెల్యేలు సమాధానం చెప్పలేకపోతున్నారు.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

అయితే వైసీపీ అధిష్టానం మాత్రం గడప గడపకు కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది.ఈ ప్రోగ్రామ్ ద్వారా పార్టీలో గెలిచిన వారు.పనిచేసేవారు ఎవరో ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.

Advertisement

ఒకవేళ లోపాలు ఉంటే త్వరగా చక్కదిద్దుకుని ఎన్నికలకు వెళ్లాలనే వ్యూహం వైసీపీలో కనిపిస్తోంది.కానీ ఊహించని రీతిలో ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు ప్రజల ఆగ్రహానికి గురికావడమే ఆ పార్టీని కలవరపరుస్తోంది.

తాజా వార్తలు