పాలనలో వైసీపీ ప్రభుత్వం విఫలం..: చంద్రబాబు

కడప జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది.ఇందులో భాగంగా కొండాపురం మండలం బెంజి అనంతపురంలో ఆయన రైతులతో సమావేశం అయ్యారని తెలుస్తోంది.

అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ గండికోట ఓ చరిత్రాత్మిక కేంద్రమని అన్నారు.రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు కృషి చేశామని తెలిపారు.

వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాయలసీమలో ఒక్క ఎకరానికి అయినా నీరు ఇచ్చిందా అని ప్రశ్నించారు.గండికోట నిర్వాసితులకు పరిహారం పంపిణీలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

అవుకు టన్నెల్ ద్వారా నీళ్లు రాకపోతే గండికోటకు నీళ్లు వచ్చేవి కాదన్నారు.రెండవ టన్నెల్ పనులను వైసీపీ ఇంతవరకు మొదలు పెట్టలేదని మండిపడ్డారు.

Advertisement

రాయలసీమకు ఒక స్టీల్ ప్లాంట్ కావాలని మైనింగ్ కార్పోరేషన్ తో జాయింట్ గా పనులకు శంకుస్థాపన చేశానన్నారు.కానీ తన బోర్డులు తీసేసి జగన్ పేరు వేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 26, శుక్రవారం, కార్తీక మాసం, 2021
Advertisement

తాజా వార్తలు