తలుపు చెక్కతో బదులిస్తున్న వైసీపీ !

పాలించే ప్రభుత్వం మీద విమర్శలు అనేవి ప్రజాస్వామ్యంలో సాధారణం గా కనిపించే విషయమే అయినప్పటికీ మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో అసలు విమర్శలు తీసుకోలేనంత స్థాయిలో రాజకీయం మారిపోతుంది.

మీరు ఒకటంటే నేను నాలుగుఅంటా అన్నట్టుగా ఎదురు దాడి చేయడమే ఈరోజు నయా రాజకీయ దొరణి గా రూపు దిద్దుకుంది .

నిన్న మొన్నటి వరకు ఆయన చాలా పెద్దమనిషి అని, ఆయనను చూసి పవన్ ( Pawan )నేర్చుకోవాలని , ఆయన అంటే మాకు చాలా గౌరవం అంటూ మాట్లాడిన నాలుకలే నేడు వాల్తేరు వీరయ్య 200 రోజుల ఫంక్షన్ లో ప్రబుత్వం పై సునిశిత వాఖ్యలు చేయగానే ఆయనను కొందరివాడుగా మార్చేశారు .ఒకప్పుడు మూడు రాజధాను ల విషయమై మద్దతు ప్రకటించినప్పుడు చిరంజీవుని నెత్తిన పెట్టుకున్న అధికార నేతలు ఈరోజు తీవ్రంగా దుయ్యబడుతున్నారు.కొడాలి నాని లాంటి వారైతే ఏకంగా ఒకడుగు ముందుకు వేసి పకోడీగాళ్లంటూ దారుణ పదజాలం ఉపయోగించారు.

మంత్రి అంబటి రాంబాబు( Minister Ambati Rambabu ) గిల్లితే గిల్లించుకోవాలా అంటూ ప్రశ్నిస్తే, పేర్ని నాని( perni nani ) లాంటివాళ్ళు ఒక వైపు నా అబిమాన నాయకుడు అని చెప్తూనే ఒకప్పుడు చిరంజీవి రాజకీయాల్లో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు బయటకు తీస్తూ మరీ విమర్శిస్తున్నారు .నిజానికి చిరంజీవి( Chiranjeevi ) పెద్ద తరహాలో చాలా సున్నితమైన టౌన్ లో మాట్లాడారు.రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన కీలక విషయాలను పట్టించుకోవాల్సిన రాజకీయ నాయకులు పొద్దస్తమానం సినిమాలపై విమర్శలు చేయడం ప్రెస్మీట్లు పెట్టడం అనవసరమైన చర్చగా సాధారణ ప్రజానీకంలో కూడా ఉంది.

అదే వ్యాఖ్యలు చిరంజీవి నోటివెంట వచ్చాయి.ప్రబుత్వ తీరు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు ఉంది అని సమస్యలు పట్టించుకుంటే చెయ్యెత్తి మొక్కుతారు అంటూ మర్యాదగానే మాట్లాడారు .అయితే తమలపాకుతో నువ్వొకటంటే తలుపు చెక్కతో నేనొకటంట అన్న రీతిలో చిరంజీవికి భారీ స్థాయిలో కౌంటర్ ఇచ్చేందుకు అధికారం పార్టీ నేతలు క్యూ కట్టారు.నిజానికి చిరు వ్యాఖ్యలకు అధికార పార్టీ ఈ స్తాయిలో కౌంటర్ఇవ్వడానికి ఒక కారణం ఉందని భవిష్యత్తులో జనసేనకు మద్దతుగా చిరు నిలబడితే ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతుందన్న ముందస్తు హెచ్చరికలు ఇవ్వడానికే వైసీపీ నేతలు ఇంత తీవ్ర స్థాయి పథజాలాన్ని ఉపయోగించారంటూ రాజకీయ విశ్లేషణలు వస్తున్నాయి .

Advertisement
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

తాజా వార్తలు