హరి హరీష్ ద్వయ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం యశోద.పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
లేడీ ఓరియంటెడ్ చిత్రంగా సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 11వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషలలో ఏకకాలం విడుదలయ్యి పాజిటివ్ బజ్ క్రియేట్ చేసుకుంది.ప్రస్తుతం ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
సమంత అనారోగ్య సమస్యల కారణంగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.అయినప్పటికీ ఈ సినిమా పాజిటివ్ బజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోవడంతో చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ సినిమాకి సంబంధించిన ఓటీటీ డీల్స్ కూడా బాగా కుదిరినట్టు తెలుస్తోంది.
ఈ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ కావడంతో ఈ సినిమా డిజిటల్ హక్కులు కూడా మంచి ధరలకే అమ్ముడుపోయినట్టు సమాచారం.ఈ క్రమంలోనే యశోద డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ కైవసం చేసుకున్నట్టు తెలుస్తుంది.
ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ఏకంగా 45 కోట్ల రూపాయలకు కైవసం చేసుకుంది.ఇకపోతే ఈ సినిమా నవంబర్ 11వ తేదీ థియేటర్లో విడుదల కావడంతో దాదాపు 8 వారాలు పూర్తి అయ్యేవరకు అమెజాన్ లో ప్రసారం కాదని తెలుస్తోంది.సమంత నాగచైతన్యత విడాకులు తీసుకున్న తర్వాత మొదటిసారిగా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావడంతో ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
ఇక కమర్షియల్ గా ఈ సినిమా ఏ విధమైనటువంటి కలెక్షన్లను రాబడుతుందో వేచి చూడాలి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy