యాదాద్రిలో భక్తులను పరుగులు పెట్టించిన భారీ వర్షం..! ఆలయ నిర్మాణాన్ని ప్రశ్నించిన భక్తులు..?

యాదాద్రిలో( Yadadri ) కురిసిన భారీ వర్షానికి( Heavy Rain ) భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

అయితే కొండపైన ఉన్న ఆలయం, క్యూ కాంప్లెక్స్ లలో కూడా నీరు వచ్చి చేరింది.

దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.భక్తులు ( Devotees ) వర్షంలో తడుస్తూ ఎటు వెళ్ళాలో, ఎక్కడ తలదాచుకోవాలో తెలియక ఆలయ పురవీధుల్లో పరిగెత్తాల్సి వచ్చింది.

వర్షం నుండి తలదాచుకునేందుకు భక్తులు తలా ఒక చోటుకు పరుగులు తీశారు.అయితే ఈ కొద్దిపాటి వర్షానికి ఘాట్ రోడ్డు మొత్తం బురదమయం అయిపోయింది.

దీంతో యాదాద్రి దర్శనానికి వచ్చిన భక్తులు కోట్లు పెట్టి నిర్మించిన ఆలయంలో కనీస వసతులు లేకపోవడం ఎలా అని విస్మయం వ్యక్తం చేశారు.

Yadadri Devotees Facing Problems With Heavy Rains Details, Yadadri Devotees , He
Advertisement
Yadadri Devotees Facing Problems With Heavy Rains Details, Yadadri Devotees , He

ఇదిలా ఉండగా మరోవైపు వర్షం కారణంగానే కొండపైనే కాకుండా కొండ కింద ఉన్న పార్కింగ్ ప్రదేశంలో కూడా భక్తులు చాలా అవస్థలు పడాల్సి రావడం మరింత విస్మయానికి గురి చేసింది.పార్కింగ్ లాట్ లో నిలిపి ఉన్న కార్లు కూడా నీటిలో మునిగిపోయాయి.పార్కింగ్ ప్రదేశం మొత్తం జలసంద్రమైపోయింది.

అక్కడ భారీగా నీరు వచ్చి చేరడంతో భక్తుల వాహనాలు నీట మునిగిపోయాయి.అయితే వర్షం నీరు వెళ్లడానికి సరైన ఏర్పాట్లు లేకపోవడంతో కొండపై నుంచి వచ్చిన వర్షం నీరు పార్కింగ్ స్థలాన్ని ముంచేశాయి.

Yadadri Devotees Facing Problems With Heavy Rains Details, Yadadri Devotees , He

దీంతో భక్తుల వాహనాలు పార్కింగ్ చేయడానికైనా, పార్కింగ్ చేసిన వాహనాలు తిరిగి తీసుకోవడానికైనా చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చిందని భక్తులు వాపోయారు.ఈ చిన్నపాటి వర్షానికి ఇలా ఉంటే రేపు వర్షాకాలంలో భారీ వర్షాలలో భక్తుల పరిస్థితి ఎలా ఉంటుందో అని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.యాదాద్రి దేవాలయం పునఃనిర్మాణం కోసం కోట్ల రూపాయలు వెచ్చించి పనులు చేసినప్పటికీ పరిస్థితి మరీ ఇంత దయనీయంగా ఉంది ఏంటి అంటూ కొందరు భక్తులు ప్రశ్నించారు.

అంతేకాకుండా ఆలయ అభివృద్ధి పనులు, నిర్మాణ పనులు నాసిరకంగా జరిగాయని భక్తులు విమర్శించారు.అయితే ఇప్పుడైనా ప్రభుత్వం తేరుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఆలయ ప్రతిష్టను కాపాడాలని భక్తులు కోరారు.

మీ కంటి ఆరోగ్యాన్ని కాపాడే అద్భుత చిట్కాలు..!
Advertisement

తాజా వార్తలు