ప్రజలు మూడ నమ్మకాలను నమ్మినన్ని రోజులు దొంగ బాబాలు పుట్టుకు వస్తూనే ఉంటారు.
అత్యంత దారుణమైన కొన్ని సంఘటనలు, కొందరు దొంగ బాబాలను చూస్తుంటే ఈ జనాలకు ఏమైంది, మరీ ఇంత తెలివి తక్కువగా ఎలా ప్రవర్తిస్తారు అనిపిస్తుంది.
ఏ జబ్బుకు అయినా కూడా ఒకే మందు అంటూ ఎంతో మంది బాబాలు వింత వింత వైధ్యం చేస్తూ ఉంటారు.కొందరు తన్నడం, కొందరు తొక్కడం, మరి కొందరు కొట్టడం ఇలా రకరకాలుగా బాబాలు తమ చికిత్సలను నిర్వహిస్తూ ఉంటారు.
తాజాగా మరో కొత్తరకం బాబా వెలుగులోకి వచ్చాడు.ఈయన జబ్బులనే కాదు పిల్లలు లేకుంటే పిల్లలను కూడా పుట్టిస్తున్నాడు.
ఎలాగో తెలుసా.ఈయన కొరుకుడుతో, ఔను కొరకడం ద్వారా పిల్లలను పుట్టించే బాబా గురించి ప్రస్తుతం వైరల్ అవుతోంది.
హైదరాబాద్‌కు కాస్తంత దూరంలో ఉండే యాదాద్రి భువనగిరి జిల్లాలోని పుల్లాయగూడెం లో ఈ కొరుకుడు బాబా అవతరించాడు.కొన్నాళ్ల ముందు వరకు రాంరెడ్డి అనే వ్యక్తి ఒక సాదారణ మనిషి.
కాని ఇప్పుడు ఆయన ఒక దైవాంశ సంభూతుడు అని అంతా నమ్ముతున్నారు.ఆయనతో కొరికించుకునేందుకు జిల్లాలు దాటి మరీ వస్తున్నారు.
ఆయన ఒక్కసారి కొరికతే జన్మ దన్యం అన్నట్లుగా జనాలు ఉదయం నుండి రాత్రి వరకు ఆయన చుట్టు తిరుగుతున్నారు.ఎన్ని సార్లు, ఎంత మంది ఆయన వద్దకు వెళ్లినా కూడా ఆయన మాత్రం తన సేమ్ మందు కొరుకుడునే ఔషదంగా ఇస్తున్నాడు.
మహిళలకు గర్బం రావడం లేదు అంటే ఆయనతో ఒకసారి కొరికిస్తే సరిపోతుంది.చేయి లేదా కాలు ఏదో ఒక చోట అతడు కొరుకుతాడు.
కొరికిన వెంటనే పిల్లలు పుడతారట.ఈ విషయాన్ని స్థానికులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.
ఇక ఈయన పురుషులను కాలితో తన్నడం కూడా చేస్తాడు.ఏదైనా దెబ్బ తగిలితే ఆ దెబ్బపై కాలితో తన్నుతాడు.
అలా ఆ దెబ్బ నయం అవుతుంది.ఇలా రకరకాల జబ్బులకు, గాయాలకు కొరుకుడు, తన్నుడు మందులు ఇస్తూ కాలం వెళ్లదీస్తున్న రాంరెడ్డి బాబా భారీగా డబ్బులు సంపాదిస్తున్నాడు.
ప్రతి మనిషి నుండి 200 రూపాయల వరకు వసూళ్లు చేసే రాంరెడ్డి ప్రతి రోజు వందల మందికి తన వైధ్యం అందిస్తున్నాడు.మూడ నమ్మకంతో వందలాది మంది ఆయన వద్దకు వస్తూనే ఉన్నారు.
పోలీసులు ఆయన్ను మందలించినా కూడా పేషంట్లు ఆయన్ను వదలడం లేదు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy