వామ్మో, కోటి రూపాయల బైకా.. హార్లీ డేవిడ్‌సన్ కొత్త మోడల్ చూస్తే దిమ్మతిరుగుద్ది!

హార్లీ డేవిడ్‌సన్ కంపెనీ ( Harley Davidson Company )ఒక రేర్ బైక్‌ను మార్కెట్లోకి వదిలింది.దాని పేరు CVO రోడ్ గ్లైడ్ RR.

ఇది మామూలు బైక్ కాదు, కేవలం 131 బైక్‌లు మాత్రమే తయారుచేస్తారు.దీని పవర్, స్టైల్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.2,147cc ఇంజన్‌తో వస్తోంది.గుర్రంలా దూసుకెళ్లడం ఖాయం.153 హార్స్‌పవర్, 204 న్యూటన్ మీటర్ల టార్క్‌తో రోడ్డు మీద రికార్డులు బ్రేక్ చేయడమే దీని పని.ఈ బైక్ బరువు తక్కువ ఉండటానికి కారణం కార్బన్ ఫైబర్ వాడటమే.CVO రోడ్ గ్లైడ్ ST కంటే ఇది ఏకంగా 22.7 కేజీలు తక్కువ బరువుంటుంది.మొత్తం బరువు 356 కేజీలు మాత్రమే.

పైగా చూడటానికి మాత్రం అదిరిపోద్ది."రేసింగ్ ఆరెంజ్" కలర్‌లో మెరిసిపోతూ ఉంటుంది.

కార్బన్ ఫైబర్ బాడీ వర్క్‌తో కలిసి చూస్తే, ఆహా ఓహో అనాల్సిందే.ఫ్యూయల్ ట్యాంక్ నుంచి ఫెయిరింగ్ వరకు వైట్ "స్క్రీమిన్ ఈగిల్" గ్రాఫిక్ ఇచ్చారు.

Advertisement

ఇంకాస్త బోల్డ్‌గా కనిపించేలా బ్లాక్ ఇంజిన్‌కి ఆరెంజ్ చారలు వేశారు.ముందు చక్రం రిమ్‌పై CVO RR లోగోను చెక్కారు.

ప్రతి చిన్న విషయంలోనూ శ్రద్ధ పెట్టారు.ఈ బైక్‌లో వాడిన ప్రతి పార్ట్ అదిరిపోయే క్వాలిటీతో ఉంటుంది.

పర్ఫార్మెన్స్ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు.బ్రేకింగ్ కోసం బ్రెంబో GP4 RX కాలిపర్లు,( GP4 RX calipers ) డ్యూయల్ 320mm రోటర్లు ఇచ్చారు.

బ్రేకులు వేస్తే మిల్లి సెకండ్లలో ఆగిపోవాల్సిందే.ఓహ్లిన్స్ USD FGR 253 ఫ్రంట్ ఫోర్కులు ఉండటంతో కంట్రోలింగ్ సూపర్ ఉంటుంది.

తుమ్మినప్పుడు కళ్లు మూసుకుంటాం ఎందుకు? కళ్లు తెరిచి తుమ్మితే అలా జరుగుతుందా??

బుల్లెట్ అల్యూమినియం స్వింగార్మ్ వాడారు.బలంగా ఉండటమే కాదు, బరువు కూడా తగ్గిస్తుంది.

Advertisement

లైట్ వెయిట్ టైటానియం అక్రాపోవిక్ ఎగ్జాస్ట్ దీనికి అదనపు ఆకర్షణ.పర్ఫార్మెన్స్ పెంచడంతో పాటు సౌండ్ కూడా అదిరిపోద్ది.హార్లీ డేవిడ్‌సన్ ఈ బైక్‌లో టెక్నాలజీ విషయంలో కూడా ఏ మాత్రం తగ్గలేదు.12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఇచ్చారు.అన్ని కంట్రోల్స్ ఈజీగా ఆపరేట్ చేయొచ్చు.

ఫెయిరింగ్‌లోనే స్పీకర్లు పెట్టారు.500-వాట్ల సౌండ్ సిస్టమ్‌తో మ్యూజిక్ పెట్టుకుంటే ప్రయాణం వేరే లెవెల్‌లో ఉంటుంది.రైడింగ్ కండిషన్స్‌ను బట్టి మార్చుకునేందుకు ఐదు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి.

కార్నరింగ్ డ్రాగ్ టార్క్ స్లిప్ కంట్రోల్, కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ ఎలక్ట్రానిక్ లింక్డ్ బ్రేక్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.ఇంత రేర్ బైక్ కదా, ధర కూడా అంతే రేంజ్‌లో ఉంటుంది.

దీని ధర అక్షరాలా 110,000 డాలర్లు.మన కరెన్సీలో దాదాపు 95.86 లక్షల రూపాయలు.కోటి రూపాయలు అంటే మామూలు విషయం కాదు.

అయితే, ఈ 131 బైక్‌లలో ఇండియాకు ఏమైనా వస్తాయా లేదా అనేది మాత్రం ఇంకా తెలియలేదు.ఒకవేళ వస్తే మాత్రం లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లే.