వావ్, ఇస్రో 3డీ వర్చువల్ మ్యూజియం లాంచ్.. చూస్తే ఆశ్చర్యపోతారంతే!

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తాజాగా తన వర్చువల్ స్పేస్ మ్యూజియం అయిన స్పార్క్‌ను లాంచ్ చేసింది.

ఈ మ్యూజియంలో ఇస్రో చరిత్ర, విజయాలను కళ్లకు కట్టినట్టు చూపించారు.

ఆసక్తి ఉన్నవారు https://spacepark.isro.gov.in సైట్‌ను విజిట్ చేసి ఈ మ్యూజియంను చూడవచ్చు.ఈ సైట్‌లో డాక్యుమెంట్స్ ఫొటోలు, వీడియోలు కూడా ఉంటాయి.అలానే స్పేస్ మిషన్లకి సంబంధించిన స్టోరీలు, రాకెట్లు, శాటిలైట్స్, ఇంకా అనేక సైంటిఫిక్ మిషన్ల గురించి ముఖ్యమైన వివరాలు ఇక్కడ పొందొచ్చు.

స్పార్క్ ఇస్రో తొలి 3D వర్చువల్ స్పేస్ టెక్ పార్క్ అని చెప్పవచ్చు.దీనిలో మ్యూజియం, థియేటర్లు, అబ్జర్వేటరీ, తోటలు ఉంటాయి. ప్లే ఎరేనా, రాకెట్లు కూడా మీరు చూసి ఎంజాయ్ చేయవచ్చు.

ఇక్కడ సరస్సు ఒడ్డున ఓ హోటల్ కూడా నిర్మించినట్టు చూపించారు.అలానే స్పార్క్ పార్క్ సముద్రపు ఒడ్డున ఉన్నట్లు మీరు వీక్షించవచ్చు.

Advertisement

ఇదే మ్యూజియంలో ఇస్రో శాటిలైట్స్, లాంచ్ వెహికల్స్ సాధించిన గొప్ప విజయాలను కూడా వివరించారు.ఈ మ్యూజియాన్ని లెఫ్ట్ అండ్ రైట్ యారోలు ఉపయోగించి 360 డిగ్రీల కోణంలో వీక్షించవచ్చు.

ఇక్కడ ప్రకృతి గొప్పతనాన్ని వివరిస్తూ సైన్స్‌కు సంబంధించిన ముఖ్యమైన వివరాలను అందించారు.

ఈ మ్యూజియంలో స్పేస్ ఆన్ వీల్స్ పేరిట ఒక బస్సును కూడా చూపించారు.ఆ బస్సులోకి పిల్లలు ఎక్కి స్పేస్ వివరాలను పొందుతారు.అబ్జర్వేటరీ, అందులోని పెద్ద టెలిస్కోప్‌ను కూడా మీరు వీక్షించవచ్చు.దీని ద్వారా విశ్వాన్ని కూడా మీరు చూడవచ్చు.

సోలార్ సిస్టమ్ పార్క్ కూడా ఇక్కడ ఉంది కాబట్టి మీరు ఒక్కో గ్రహం గురించి విలువైన సమాచారం తెలుసుకోవడం సాధ్యపడుతుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 1, శనివారం 2023
Advertisement

తాజా వార్తలు