పట్టణాలు సమస్యల నెలవులవుతున్నాయా ?

ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ 27 డిసెంబర్‌ 2013న తీసుకున్న 68/239 తీర్మానం ప్రకారం ప్రతియేటా 31 అక్టోబర్‌న ‘ప్రపంచ నగరాల దినోత్సవాన్ని 2014 నుంచి పాటించడం జరుగుతున్నది.ప్రపంచవ్యాపితంగా 10,000లకు పైగా ఉన్న నగరాలు ఉన్నాయి.

ప్రపంచ జనాభాలో దాదాపు 57 శాతం వరకు పట్టణాలలోనే నివసించడం జరుగుతోంది.2050 నాటికి 70 శాతం ప్రపంచ జనాభా పట్టణాల్లో నివసిస్తారని అంచనా వేస్తున్నారు.అతి పెద్ద ప్రపంచ నగరాల్లో టోక్యో, జకార్తాల తరువాత ఢిల్లీ మూడవ స్థానంలో అతి పెద్ద నగరంగా పేరుగాంచింది.

భారత దేశంలో 4000లకు పైగా నగరాలు ఉండగా, అందులో 388 నగరాల జనాభా లక్షకు పైగా ఉండగా, 46 మహానగరాల జనాభా ఒక మిలియన్‌ దాటింది.జనసాంద్రత అత్యధికంగా ఉన్న నగరాల్లో ముంబాయి, ఢిల్లీ, బెంగుళూరు, కొల్‌కత్తా, చెనై, అహ్మదాబాదు, హైదరాబాదు, పూనె లాంటివని ముందు వరుసలో ఉన్నాయి.

ఢిల్లీ, ముంబాయి మహానగరాల జనాభా 10 మిలియన్లు దాటింది.పట్టణాలు ప్రణాళికాబద్దంగా ఎదగడం లేదు.పేదలకు కనీస వసతులు మృగ్యమైనాయి.

అపరిశుభ్ర పరిసరాలు, నీటి ఎద్దడి, నిలువ నీడ లేకపోవడం, పేవ్‌మెంట్లపై గుడారాలు వేసుకోవడం, శ్రమ దోపిడి రాజ్యమేలడం లాంటి సమస్యలతో పట్టణీకరణ సంక్షోభంలో పడుతున్నది.ప్రపంచ నగరాల దినం-2022 నినాదం: వరల్డ్ సిటీస్‌ డే-2022 నినాదంగా ‘పట్టణ ప్రాంతాల నిమ్నవర్గాలను సురక్షిత, నిలకడ గలిగిన సుస్థిరాభివృద్ధి వైపు నడపడం(సస్టేన్డ్‌ ఎఫర్ట్స్‌ టు షేప్‌ ఇన్‌క్లూజివ్‌, సేఫ్‌, రిసిలియంట్‌ అర్బన్ ఏరియాస్)‌‌‌’ అనే అంశం తీసుకోబడింది.ప్రపంచ నగరాలు, మహానగరాల స్వచ్ఛత, పట్టణీకరణ సమస్యలు, నగరీకరణ ఎదుర్కొంటున్న సవాళ్ళు, సుస్థిరాభివృద్ధికి తీసుకోవలసిన జాగ్రత్తలు, నగరాల మధ్య సమన్వయ సహకారాలు వంటి అంశాలను చర్చించే వేదికగా ప్రపంచ నగరాల దినం ఉపయోగపడుతోంది.కోవిడ్‌-19 విజృంభనతో నగరాలు ఖాళీ చేయబడి గ్రామీణ, మండల కేంద్రాలు జన కళతో నిండిన విషయం మనకు గుర్తుంది.

World Cities Day 2022 Are Cities In Trouble Details, World Cities Day 2022 ,citi
Advertisement
World Cities Day 2022 Are Cities In Trouble Details, World Cities Day 2022 ,citi

పట్టణీకరణ సవాళ్లు: పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో నగరాల చుట్టు మురికివాడలు పుట్టుకురావడం, స్వచ్ఛత లోపించడం, పర్యావరణ సమస్యలు ఉత్పన్నం కావడం, ఆర్థిక సామాజిక సాంస్కృతిక మార్పులు చోటు చేసుకోవడం, ప్రకృతికి విరుద్దంగా మానవ జీవనశైలి వేగంగా మారడం, రద్దీ పెరగడం, నీటి కొరత ఉత్పన్నం కావడం లాంటి సమస్యలు నగరాలను వెన్నాడుతున్నాయి.విద్య, అసమానతలు, పేదరికం కారణంగా పల్లెజనులు పట్నాలకు తరలి మురికి వాడలు పెరుగుతున్నాయి.స్లమ్‌ ఏరియాలో బతుకుతున్న నిరు పేదలు అమానవీయ దుస్థితుల్లో బతుకులు ఈడుస్తున్నారు.

పట్టణీకరణ పెరిగిన కొద్దీ మురికి వాడలు విస్తరిస్తుండటం గమనిస్తున్నాం.నగర అద్దాల మేడల తెర వెనుక చీకటి బతుకులు వెక్కిరిస్తున్నాయి.

పట్టణీకరణతో పాటు నగర సమస్యలు కూడా అనేక రెట్లు పెరగడం గమనిస్తున్నాం.

భారత్‌లో స్వచ్ఛ సర్వేక్షన్‌-2022: భారత ప్రభుత్వం దేశంలోని మహానగరాలు, ముఖ్య పట్టణాల సర్వతోముఖాభివృద్ధికి ‘స్వచ్ఛ భారత్‌ మిషన్‌’లో భాగంగా ‘స్మార్ట్ సిటీ’ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.స్వచ్ఛ భారత్‌ మిషన్‌‌లో భాగంగా దేశవ్యాప్త నగరాల స్వచ్ఛ సర్వేక్షణ్-2022‌ సర్వేలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ నగరం (లక్ష జనాభా మించిన) క్లీన్‌ సిటీ వరుసగా 6వ సారి ప్రథమ స్థానంలో నిలువగా, సూరత్‌, నవీ ముంబాయ్‌ నగరాలు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి.ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాలు జాబితాలో 4,5,7 స్థానాల్లో నిలవడం సంతోషదాయకం.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల.. పైచేయి సాధించిన అమ్మాయిలు..!

లక్షలోపు జనాభా కలిగిన నగరాల్లో పంచగంగా-కరద్‍ నగరం ఆదర్శంగా తొలి స్థానంలో నిలిచింది.ఈ సంవత్సరంలో దేశవ్యాప్తంగా 4,355 నగరాలు, కంటోన్మెంటులు, గంగాతీర నగరాల్లోని 9 కోట్ల పౌరుల నుండి అభిప్రాయాలు సేకరించడమే కాకుండా వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ, మురికి నీటి నిర్వహణ మరియు ట్రీట్‌మెంట్‌, ఘన కాలుష్య రహిత నగర ప్రయత్నాలు లాంటి అంశాలను పరిశీలించి క్లీన్‌ సిటీల జాబితాను తయారుచేసి వివిధ వర్గాలలో స్వచ్ఛ మహోత్సవ్‌-2022 పేరుతో అవార్డులను ప్రకటించారు.

Advertisement

యంపీ, ఛత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర‌లు ఉత్తమ రాష్ట్రాలుగా స్వచ్ఛ సర్వేక్షణ్‌ పథకంలో ముందున్నాయి.ఉత్తమ చిన్న రాష్ట్రాల్లో ఝార్ఖండ్‌, ఉత్తరా‌ఖండ్ రాష్ట్రాలు నిలిచాయి.‌ ఉత్తమ గంగా తీర నగరంగా హరిద్వార్‌ నిలిచింది.

ఫాస్ట్‌ మూవింగ్‌ సిటీగా శివమొగ్గా, పటాన్‌ నగరాలు నిలిచాయి.క్లీన్‌ సిటీల జాబితాలో గోరక్‌పూర్, రేవా, దోవా, వారీ), ఆగ్రా నగరాలు చివరలో ఉన్నాయి.6వ సారి క్లీనెస్ట్‌ సిటీగా ఇండోర్‌: స్వచ్ఛ సర్వేక్షణ్‌ నిర్వహణకు 6000 పాయింట్లతో నగరపౌర సేవలు, పౌరుల అభిప్రాయాలు, ప్రత్యక్ష పరిశీలనలు, టాయిలెట్ల అందుబాటు వంటి అంశాలతో క్లీన్‌ సిటీల జాతీయ జాబితాను తయారుచేస్తారు.

ఒక మిలియన్‌కు పైగా జనాభాగల ఇండోర్‌ నగరం మెుదటి నుండి ప్రతి సంవత్సరం క్లీన్‌ సిటీగా ఎంపిక కావడంతో ఈ నగరానికి గుర్తింపు, కీర్తి పెరిగి, విమర్శకులను సైతం విస్మయానికి గురిచేస్తోంది.గతంలో అన్ని నగరాల వలె దుమ్ము, ధూళి, చెత్త చెదారం, మురుగు నీరు, వీధుల్లో జంతువుల స్వైరవిహారలతో సహజీవనం చేసిన ఇండోర్‌ నగరవాసులు ఇప్పుడు తమ సిటీని చూసి గర్వపడుతున్నారు.పలు నగరాల పౌరులు, స్వచ్ఛంధ సంస్థలు, బాధ్యతగల పౌర సమాజం కూడా తమ సహకారం అందిస్తూ ఇంటింట సేకరించిన వ్యర్ధాలను రెడ్యూస్‌, రీయూజ్‌, రీసైకిల్‌ పద్దతిలో చెత్తను విభజించి ప్రాసెస్‌ చేయడంతో నగర సుందరీకరణకు శ్రీకారం చుట్టబడింది.

స్వచ్ఛ సిటీగా పేరొందిన ఇండోర్‌లో ప్రస్తుతం నగర పౌరులు గర్వంగా, క్రమశిక్షణగా సైనికుల్లా సుందరీకరణలో భాగస్వాములు కావడంతో ప్రభుత్వ ప్రయత్నాలు సులభమైనాయి.నగరాలు నివాసయోగ్యంగా, సురక్షిత తాగు నీటి వసతులతో, ప్రజారవాణ/ప్రజావైద్య వ్యవస్థలతో అన్ని వర్గాల ప్రజలకు సమాంతరంగా చేయూతనిస్తూ పట్టణాలు సుస్థిరాభివృద్ధి దిశగా వడివడిగా అడుగులు వేయాలి.

మన తెలంగాణ రాష్ట్రం స్వచ్ఛ సర్వేక్షణ్‌ జబితాలో తొలి వంద లోపు ర్యాంకులను పొందేలా రానున్న రోజుల్లో చర్యలు తీసుకోవాలని బాధ్యతగల తెలంగాణ పౌరులుగా కోరుకుందాం.

తాజా వార్తలు