హైదరాబాద్ గోషామహల్ నాలా కూలిన ఘటనలో పనులు వేగవంతం

హైదరాబాద్ లోని గోషామహల్ లో నాలా కూలిన ఘటనలో జీహెచ్ఎంసీ పనులు వేగవంతం చేసింది.ఈ మేరకు యుద్ధ ప్రతిపాదికన పనులు చేపట్టింది.

ఇందులో భాగంగా నిన్న రాత్రి నుంచి దాదాపు 30 టిప్పర్ల మట్టిని తొలగించారు అధికారులు.అదేవిధంగా నాలా వద్దకు ఎవరూ రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.

మరోవైపు ఘటనా స్థలాన్ని టెక్నికల్ టీమ్ త్వరలో పరిశీలించనున్నారని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.వాళ్ల పరిశీలన అనంతరం నాలా పునర్ నిర్మాణ పనులు చేపడతామని పేర్కొన్నారు.

అయితే గోషామహల్ ఘటన తర్వాత నగరంలోని ఇతర పురాతన నాలాల పరిస్థితిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది.

Advertisement
Rose Flowers Stomach Fat : గులాబీ పూలతో ఇలా చేస్తే బాన పొట్ట ఫ్లాట్ గా మారడం ఖాయం!