ఈ స్పైసెస్ తో అపారమైన ఆరోగ్య లాభాలు.. ఏయే సమస్యకు ఏది వాడాలంటే?

మసాలా దినుసులు(స్పైసెస్).నిత్యం వంటల్లో వాడుతూనే ఉంటాము.

పసుపు, జీలకర్ర, లవంగాలు, మిరియాలు ఇలా స్పైసెస్ లో ఎన్నో రకాలు ఉన్నాయి.

అయితే చాలా మంది వాటి ప్రయోజనాల గురించి తెలియకుండానే ఉపయోగిస్తుంటారు.

నిజానికి స్పైసెస్ తో అపారమైన ఆరోగ్య లాభాలు ఉన్నాయి.మరి ఇంతకీ ఏయే సమస్యకు ఏ స్పైస్ ను వాడాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

జీలకర్ర( cumin ).వెయిట్ లాస్ కు ఎంతో ఉత్తమంగా సహాయపడుతుంది.వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక గ్లాస్ వాటర్ లో మరిగించి తీసుకోవాలి.

Advertisement

ప్రతిరోజు ఉదయాన్నే ఒక గ్లాస్ జీలకర్ర వాటర్ ని తాగితే క్యాలరీలు సూపర్ ఫాస్ట్ గా బ‌ర్న్ అవుతాయి.దాంతో వేగంగా బరువు తగ్గుతారు.

అలాగే నిద్రలేమి( Insomnia ) అనేది ఇటీవల రోజుల్లో కోట్లాది మందిని వేధిస్తోంది.అయితే నిద్రలేమికి చెక్ పెట్టడంలో జాజికాయ( nutmeg ) ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.గ్లాస్ గోరువెచ్చని పాలలో పావు టేబుల్ స్పూన్ జాజికాయ పొడి మరియు వన్ టేబుల్ స్పూన్ బెల్లం తురుము కలిపి సేవించాలి.

ఇలా ప్రతిరోజూ తీసుకుంటే ప్రశాంతమైన సుఖమైన నిద్ర మీ సొంతం అవుతుంది.జీర్ణ సంబంధ సమస్యలకు న‌ల్ల మిరియాలు చక్కని విరుగుడు.రోజుకు రెండు లేదా మూడు నల్ల మిరియాలను నమిలి తిని.

ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని సేవించాలి.ఇలా చేస్తే గ్యాస్, ఎసిడిటీ, మలబద్దకం, అజీర్తి వంటి జీర్ణ‌ సమస్యలు దరిదాపుల్లోకి కూడా రావు.

పవన్ కళ్యాణ్ మరో యోగి ఆదిత్యనాథ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణవంశీ!
చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!

నోటి నుంచి దుర్వాసన రాకుండా ఉండడానికి దాల్చిన చెక్క ( Cinnamon )హెల్ప్ చేస్తుంది.చిన్న దాల్చిన చెక్కను నోట్లో వేసుకుని బాగా నమలాలి.ఇలా చేస్తే బ్యాడ్ బ్రీత్ కంట్రోల్ అవుతుంది.

Advertisement

తలనొప్పి నుంచి తక్షణ ఉపశమనాన్ని అందించడానికి అల్లం సహాయపడుతుంది.అర అంగుళం అల్లం ముక్కను మరిగించిన వాటర్ ని తాగితే తలనొప్పి పరార్ అవుతుంది.

ఇక పంటి నొప్పి ఇబ్బంది పెడుతున్నప్పుడు రెండు లవంగాలను తీసుకుని పంటి కింద పెట్టుకోవాలి.ఇలా చేస్తే పంటి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

తాజా వార్తలు