ఆడవారు ఆరు గంటల తర్వాత తింటే అంతేనట

మారిన పరిస్థితులు మరియు జీవన విధానం కారణంగా తినే సమయాలు మరియు తింటున్న ఫుడ్‌ విషయంలో చాలా మార్పులు వస్తున్నాయి.

తినే ఆహారం వల్ల అనేక రకాల అనారోగ్యాలు వస్తున్నాయి.

ఒకప్పుడు రాత్రి ఏడు లేదా ఎనిమిది గంటల వరకు తిని పడుకునేది.పడుకోక పోయినా తినడం మాత్రం పూర్తి చేసే వారు.

కాని ఇప్పుడు మద్యరాత్రి దాటిన తర్వాత తినే వారు కూడా లేకపోలేదు.ఎంతో మంది ఎన్నో రకాలుగా అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు.

తాజాగా అమెరికాకు చెందిన ప్రముఖ ఆరోగ్య సంస్థ ఆసక్తికర పరిశోదన ఫలితాన్ని వెళ్లడించింది.దాదాపుగా 200 మంది మహిళలను ఎంపిక చేసుకున్న సదరు యూనివర్శిటీ వారు ఆహారపు అలవాట్లను పరిశీలించింది.

Advertisement

దాదాపు ఏడాది పాటు వారి రెగ్యులర్‌ ఆహారపు అలవాట్లతో పాటు వారి ఆరోగ్యాన్ని గమనిస్తూ వచ్చింది.సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎక్కువగా తినే వారి ఆరోగ్యం చాలా ఇబ్బందిగా ఉండటంతో పాటు చాలా మంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.

అనేక రకాల అనారోగ్య సమస్యలను కూడా వారు ఎదుర్కొన్నట్లుగా రిపోర్ట్‌లో వెళ్లడయ్యింది.ఆడవారిలో మెటబాలిజం రేటు కాస్త తక్కువగా ఉంటుంది.

వారికి జీర్ణ శక్తి కూడా తక్కువగా ఉంటుంది.అందుకే రాత్రి 6 గంటల తర్వాత ఎక్కువ క్యాలరీస్‌తో కూడిన ఆహారంను తీసుకోవడం ఎంత మేరకు కరెక్ట్‌ కాదని వైధ్యులు చెబుతున్నారు.

న‌ల్ల‌ని పాదాల‌ను తెల్ల‌గా మార్చే ట‌మాటా..ఎలాగంటే?
Advertisement

తాజా వార్తలు