పోలీసుల నుండి తప్పించుకోవటానికి ఓ మహిళ ఇలా చేస్తుందని ఊహించరు.. ?

నిజాయితీగా బ్రతికే వారు ఎవరికి బయపడవలసిన అవసరం లేదు.తప్పుడు పనులు చేసే వారికే భయం ఎక్కువ.

ఇలాగే తప్పుడు పనులు చేస్తున్న ఓ మహిళ తాను చేసిన తప్పును కప్పిపుచ్చడానికి ఇంతటి సాహసం చేస్తుందని ఎవరూ ఊహించరు.తాము చేస్తున్న తప్పు నుండి తప్పించుకోవాలని చూసి చివరికి మృత్యువుకు చిక్కింది.

అసలేం జరిగిందో తెలుసుకుంటే.చెన్నైలోని ఒడైకుప్పానికి చెందిన ఉషా అనే మహిళ తన భర్తతో కలసి గత కొన్నేళ్లుగా అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారట.

ఈ విషయంలో అరెస్ట్ అవడం, బయటకు రావడం వీరి జీవితంలో కామన్‌గా మారిపోయిందట.ఈ క్రమంలోనే శుక్రవారం పోలీసులు వీరిని అరెస్ట్‌ చేయటానికి ఒడైకుప్పంలోని ఇంటికి వెళ్లగా, పోలీసులు వస్తున్న విషయం తెలుసుకున్న ఉషా వారి నుండి తప్పించుకోవటానికి ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుందట.

Advertisement

వెంటనే అలర్ట్‌ అయిన పోలీసులు ఎలాగోలా మంటలను ఆర్పి దగ్గర్లోని హాస్పిటల్‌కు తరలించారట.అయితే అప్పటికే 50 శాతం కాలిన గాయాలతో ఉన్న ఉషా పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారట.

ఇక ఈ మహిళ పిచ్చిగానీ పోలీసుల నుండి తప్పించుకోవాలని చూసి చివరికి చావుబ్రతుకుల మధ్య ఉండటం విచారకరం.

Advertisement

తాజా వార్తలు