వైరల్ వీడియో: సరదాగా ఆటాడుకుందాం అనుకుంది.. తగలరానిచోట తగలడంతో...!

కొందరు తెలివి తక్కువగా ఆలోచిస్తూ చిక్కుల్లో పడుతుంటారు.వారి సిల్లీ పనులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతుంటాయి.

తాజాగా ఈ కోవకు చెందిన మరో వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ అవుతుంది.దీనిని సీసీటీవీ ఇడియట్స్ అనే ఒక ప్రముఖ వైరల్ వీడియో షేరింగ్ పేజీ పోస్ట్ చేసింది.

మూడున్నర లక్షలకు పైగా దీనికి వ్యూస్ వచ్చాయి.వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువతి( Woman ) ఒక వస్తువు పై కూర్చుని ఉండటం చూడవచ్చు.

ఆ వస్తువు మంచు ప్రాంతంలో మనుషులు ఎక్కి ప్రయాణాలు చేసే వస్తువు లాగా కనిపించింది.అయితే దానిపై కూర్చొని ఆ యువతి కూడా ఒక రైడ్ ( Ride ) ఎంజాయ్ చేయాలనుకుంది.

Advertisement

కాకపోతే ఆ వస్తువు అనేది ఒక తారు రోడ్డుపై ఉంది.దానికి తాడు కట్టి బైక్ తో( Bike ) లాగుతూ ఉంటే దానిపై కూర్చొని రైడ్ ఆస్వాదించాలని యువతి అనుకుంది.

కానీ ఆమె ఒకటి అనుకుంటే మరొకటి జరిగింది.సరదా కోసం ఆ యువతి చేసిన ఈ పని చివరికి ఆమెను తీవ్రమైన నొప్పితో బాధ పెట్టింది.

వైరల్ వీడియోలో( Viral Video ) సదరు యువతి మెటల్ రాడ్లతో తయారైన ఆ వస్తువుపై కూర్చుంది.ఆమె ముందే ఒక బైక్ ఉంది.ఆ బైక్ కు, ఆ వస్తువుకు ఒక తాడు కట్టారు.

అనంతరం బైక్ ముందుకు వెళ్లాలంటూ ఆ యువతి సైగ చేసింది.మోటార్ సైకిల్‌పై కూర్చున్న వ్యక్తి ముందుకు నడపడం స్టార్ట్ చేశాడు.

పైసా ఖర్చు లేకుండా ముఖంపై మచ్చలను పోగొట్టుకోవాలనుకుంటే ఇలా చేయండి!

అయితే ఆ తాడు ఎలాస్టిక్ రోప్ కావడం వల్ల అది పుట్టుక్కుమని తెగిపోయింది.క్షణాల్లోనే తాడు రబ్బర్ లాగా వెనక్కి వచ్చి యువతికి బలంగా తగిలింది.

Advertisement

వీడియోలో చూసినట్లు తగలరని చోట ఆమెకు ఈ రోప్ వచ్చి తగిలింది.సున్నితమైన ప్రాంతంలో అది వచ్చి కొట్టుకోవడంతో యువతి బాగా అల్లాడిపోయింది.నొప్పి తట్టుకోలేక ఆమె కంటతడి పెట్టుకుంది.

మోటార్ సైకిల్ వ్యక్తి వెంటనే ఆమెను ఓదార్చడానికి రాగా అతడిని చెంప మీద ఆమె కొట్టింది.ఈ వీడియో చూసిన నెటిజన్లు "అయ్యో పాపం, బాగా దెబ్బ తగిలినట్లు ఉంది.

" అని సానుభూతి చెబుతున్నారు.ఏ తాడు వాడాలో కూడా తెలియకపోతే ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందని కొందరు కామెంట్ చేశారు.ఈ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి.

తాజా వార్తలు