భర్తను జైలు నుంచి రప్పించేందుకు ఆ మహిళ ఏం చేసిందో తెలుసా?

దుర్గా దేవి పోలీస్ స్టేషన్ కు వచ్చింది.తన భర్తను విడిచి పెట్టాలని పోలీసులను అడిగింది.

భర్తను విడిచి పెట్టకపోతే తన మంత్ర శక్తితో అందర్నీ శపిస్తానని బెదిరించింది.దుర్గా దేవి పోలీసు స్టేషన్ కు రావడం ఏమిటి అనుకుంటున్నారేమో.

కానీ నిజంగానే వచ్చింది.అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే.

బిహార్ రాష్ట్రంలోని జమూయీ జిల్లాకు చెందిన వ్యక్తి కార్తీక్ మాంఝీ తాగుడుకు బానిసగా మారాడు.ఏదో కేసులో అతడిని పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లారు.

Advertisement

అతడిని ఎలాగైనా బయటకు తీసుకురావడానికి అతని భార్య సంజూ దేవి చేసిన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అసలు ఆమె ఏమీ చేసిందంటే.

ఓ చేతిలో కర్ర, మరో చేతిలో బియ్య పట్టుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్లిన సంజూ దేవి.అక్కడ వీరంగం సృష్టించింది.

నేను భక్తు రాలిని, నాలో దుర్గా మాత ఉంది.నా భర్తను కాపాడుకునేందుకు వచ్చా అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగింది.

తనతో పాటు తెచ్చుకున్న కర్రతో గిమ్మిక్కులు చేయడం ప్రారంభించింది సంజూ దేవి.బియ్యం గింజలను పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు అక్కడ ఉన్న అందరి తలలపైనా చల్లింది.

నూతన సంవత్సరం ఎర్రటి కాగితంపై ఇలా రాస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది!

తన ఆదేశం ప్రకారమే అంతా జరుగుతుందని.తను చెప్పకపోతే ఏదీ జరగదని చెప్పుకొచ్చింది.

Advertisement

మహిళా కానిస్టేబుళ్లు ఆమెను బయటకు తీసుకెళ్లడంతో హై డ్రామాకు కాస్త తెరపడింది.

తాజా వార్తలు