పెళ్లైన ఏడేళ్లకు గర్భం, ఒకేసారి ఐదుగురికి జన్మ, కానీ..!

తల్లి కావడం అనేది గొప్ప కానుక.పిండాన్ని నవ మాసాలు మోసి, కని వారితో అమ్మ అని పిలిపించుకోవడం అనేది నిజంగా ఓ మధురానుభూతి.

కానీ కొందరు మహిళలకు ఈ గొప్ప అవకాశం రావడానికి చాలా సమయం పడుతుంది.పెళ్లైన సంవత్సరాల తర్వాత కూడా గర్భం రాదు.

అలాగే ఓ మహిళకు జరిగింది.వివాహం జరిగిన ఏడెళ్ల తర్వాత గర్భం వచ్చింది.

ఇక ఆ ఇంట్లో సభ్యుల ఆనందం గురించి ఎంత చెప్పినా తక్కువే.ఆ మహిళను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు.

Advertisement

కాన్పులో ఒకేసారి ఐదుగురు శిశువులు జన్మించారు.వారి ఆనందం ఐదింతలు అయింది.

ఒక్కరు చాలూ అనుకున్న వారికి ఒకేసారి ఐదుగురు పుట్టడంతో ఉబ్బితబ్బిబ్బు అయ్యారు.ఆనందంతో గాలిలో తేలిపోయారు.

కానీ, అంతలోనే చేదు వార్త వినాల్సి వచ్చింది.వైద్యులు వచ్చి సారీ చెప్పడంతో గుండెలు పగిలేలా ఏడ్చారు.

అసలేం జరిగిందంటే.అది రాజస్థాన్ కరౌలీ జిల్లా.

సంతానలేమి సమస్యలతో బాధపడుతున్నారా..? అయితే ఇవి రాత్రిపూట తింటే చాలు..!

అష్రఫ్ అలీ భార్య రేష్మకు సోమరావం ఒకే కాన్పులో ఐదుగురు శిశువులు జన్మించారు.సాధారణ ప్రసవం ద్వారానే ఐదుగురు జన్మించినట్లు వైద్యులు తెలిపారు.

Advertisement

ఇద్దరు మగ పిల్లలు.ముగ్గురు ఆడ పిల్లలు జన్మించారు.

ఏడేళ్ల తర్వాత సంతానం కలగడంతో ఆ కుటుంబసభ్యులు చాలా ఆనందపడ్డారు అయితే ఆ దంపతులకు ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు.పుట్టిన శిశువుల్లో ముగ్గురు వెంటనే ప్రాణాలు కోల్పోయారు.

శిశువులు పూర్తి స్థాయిలో ఎదగలేదు.ఏడో నెలలోనే గర్బం నుండి బయటకు వచ్చారని వైద్యులు చెప్పారు.

నెలలు నిండక ముందే జన్మించడం వల్ల శిశువులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు.

తాజా వార్తలు