వైరల్: పాపం పిటి ఉష మాదిరి పరుగెత్తి... ఆఖరికి బక్కబోర్లాపడింది పాపం, చూడండి?

సోషల్ మీడియా పరిధి పెరుగుతున్న వేళ కొన్ని రకాల వీడియోలు నెటిజన్లను రంజింపజేస్తున్నాయి.ఈ క్రమంలో ఓ వీడియో విపరీతంగా ఆహుతుల మనసులను దోచుకుంటోంది.

మనకు ఇష్టమైన వాళ్లని అనుకోకుండా కలిసినా లేదా మనకు ఎదురైనా పట్టరాని ఆనందానికి గురవుతాం.వాళ్లను చూడగానే హయ్‌ అని పలకరించడం లేదా కరచలనం చేయడం వంటి పనులు చేస్తాం.

ఇంకా బాగా నచ్చిన వాళ్లయితే వెంటనే వాళ్లను హగ్‌ చేసుకోవడం వంటివి చేస్తుంటాం.ఇక్కడ కూడా అచ్చం అలానే జరిగింది.

కట్ చేస్తే ఆమె అబాసుపాలైంది.వివరాల్లోకి వెళితే, ఒక అమ్మాయి తన భర్తను ఎయిర్‌ పోర్ట్‌ నుంచి రిసీవ్‌ చేసుకోవానిడానికి వచ్చింది.

Advertisement

ఐతే చాలా రోజుల తర్వాత ఒకరినొకరు కలుసుకుంటున్నారు.దీంతో ఆమె ఎయిర్‌ పోర్ట్‌లో తన భర్త కనిపించగానే ఒకింత ఉద్వేగానికి లోనైంది.

దాంతో ఆనందంతో హగ్‌ చేసుకోవడానికి పరిగెట్టింది.అచ్చం సినిమాలోని హిరోయిన్‌ మాదిరి పరుగెత్తింది.

ఇంతలో అనుకోకుండా భర్త స్లిప్‌ అయి కిందపడిపోవడంతో వేగంగా వస్తున్న ఆమె కూడా భర్తని గుద్దుకుని కింద పడిపోయింది.

ఈ ఆకస్మిక పరిణామానికి అక్కడే ఉన్న కొంతమంది ప్రయాణికులు నవ్వుకున్నారు.ఆ జంటకు సాయం చేసేందుకు అక్కడే ఉన్న మిగతా ప్రయాణికులు రాకమునుపే వారికివారే సర్దుకుని పైకి లెగిసిపోవడం కొసమెరుపు.పైగా సదరు మహిళ లేచిన వెంటనే తన భర్తను గట్టిగా ప్రేమతో ఆలింగనం చేసుకుంది.

ల‌వ్ లో ఉండ‌గా... టెలిగ్రామ్ పంపిన అనుభూతి.! ఇప్ప‌టికీ ఆ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ యా ఆయ‌న న‌న్ను ఆట‌ప‌ట్టిస్తుంటారు.!

ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది.దీంతో నెటిజనల్లు మొదట ఆ జంటకు మంచి చెప్పులు కొనివ్వాలి ఇలా పడిపోకుండా ఉండేందుకుని అని కామెంట్లు చేస్తు ట్వీట్‌ చేశారు.కొంతమంది వారి ప్రేమకు ముగ్ధులవుతున్నారు.

Advertisement

మీరు కూడా సదరు వీడియో చూసి కామెంట్ చేయండి మరి!.

తాజా వార్తలు