ఆ ఒక్క మాటతో ... విజయసాయిని జగన్ పక్కన పెట్టేస్తారా ? 

ఇప్పటికే రాజకీయంగా వైసిపి( YCP ) అనేక ఇబ్బందులు ఎదుర్కుంటోంది.

టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వైసిపి నేతలనే టార్గెట్ చేసుకుంటూ కేసులు నమోదు చేస్తూ ఉండడం, వైసిపి లీడర్లు,  కేడర్ ను భయభ్రాంతులకు గురిచేసి తమ పార్టీలో చేర్చుకునేందుకు వ్యూహం రచిస్తూ ఉండడం వంటి పరిణామాలతో వైసిపి అధినేత జగన్( Jagan ) కాస్త టెన్షన్ గానే ఉన్నారు.

  ఈ సమయంలోనే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయి రెడ్డి( Vijay Sai Reddy ) వ్యవహారం మరింత తలనొప్పిగా మారింది.దేవదాయ శాఖలో పనిచేసే ఓ మహిళతో విజయసాయిరెడ్డి సన్నిహితంగా ఉన్నారనే వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

  దానికి సంబంధించిన వ్యవహారంపైనే వైసీపీని టార్గెట్ చేసుకుని టిడిపి కూటమి ఎదురు దాడి చేస్తుండడంతో వైసిపి కి ఈ వ్యవహారం ఇబ్బందికరంగా మారింది.

With That One Word, Will Vijayasai Be Sidelined By Jagan, Ysrcp, Jagan, Vijaya S

 తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు కొద్దిరోజుల క్రితం విజయ్ సాయి రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా వైసీపీలోని కొంతమంది నేతలే ఉద్దేశపూర్వకంగా తనపై కుట్రలు చేస్తున్నారంటూ చేసిన కామెంట్స్ మరింత వైరల్ అయ్యాయి ఈ వ్యవహారం జగన్ కూ మరింత ఆగ్రహాన్ని కలిగించిందట .వైసీపీలోని కీలక నేతలు తనపై కుట్ర చేస్తున్నారంటూ మాట్లాడిన తీరు సరికాదని , ఈ తరహా వ్యాఖ్యలు వైసీపీని మరింత ఇబ్బందులకు గురిచేస్తాయని భావిస్తున్న జగన్ విజయసాయిరెడ్డిని పక్కన పెట్టే ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది .

With That One Word, Will Vijayasai Be Sidelined By Jagan, Ysrcp, Jagan, Vijaya S
Advertisement
With That One Word, Will Vijayasai Be Sidelined By Jagan, Ysrcp, Jagan, Vijaya S

విజయసాయిరెడ్డి పార్టీ మారే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం గత కొద్దిరోజులుగా రాజకీయ వర్గాల్లో జరుగుతున్న నేపథ్యంలో , జగన్ సైతం ఆయనను పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న సంకేతాలు వైసీపీలో మరింత గందరగోళానికి కారణం అవుతున్నాయి.త్వరలోనే వైసీపీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసేందుకు సిద్ధమవుతున్న జగన్ అప్పుడే విజయసాయిరెడ్డిని పక్కన పెట్టే విధంగా నిర్ణయం తీసుకున్నారట.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు