వైర్‌లెస్‌ కరెంట్‌ కూడా అందుబాటులోకి వచ్చేస్తోందోచ్!

ఇపుడు ఎక్కడ చూసినా వైర్‌లెస్‌ ఎలక్ట్రానిక్ పరికరాలే కనబడుతున్నాయి.నిన్న మొన్నటివరకు వైర్ తో వున్న ఎలక్ట్రానిక్ పరికరాలు మార్కెట్లో కనబడేవి.

అయితే నేటితో వాటికి కలం చెల్లింది.నేటి యువత అధునూతనంగా ఏవైతే మార్కెట్లోకి వస్తాయో వాటిపైనే మొగ్గు చూపుతున్నారు.

ఇక ఆ సంగతి పక్కన బెడితే.ఇపుడు వైర్‌లెస్‌ కరెంటు కూడా రాబోతోంది.

ఎలా సాధ్యం అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే.త్వరలోనే వైర్‌లెస్‌ కరెంటు కూడా మన ఇంట్లోకి రావొచ్చు.తాజాగా దక్షిణ కొరియాలోని సెజాంగ్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధక బృందం ఓ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది.30 మీటర్ల దూరం దాకా ఇన్‌ఫ్రారెడ్‌ కాంతిని ఉపయోగించి వైర్‌లెస్‌గా విద్యుత్తును ప్రసరింపజేసింది.400 మిల్లీ వాట్ల విద్యుత్తును సురక్షితంగా ప్రసరింపజేసి LED లైటు వెలిగేలా చేశారు. ట్రాన్స్‌మిటర్‌, రిసీవర్‌ ద్వారా ఈ విద్యుత్తు సరఫరా జరిగినప్పుడు ఏదైనా ఆటంకం కలిగితే వెంటనే వ్యవస్థ మొత్తం పవర్‌ సేఫ్‌ మోడ్‌లోకి వెళ్లిపోతుంది.

Advertisement

దీంతో ఎలాంటి అపాయాలు జరుగకుండా చూస్తుంది.

ఈ వైర్‌లెస్ కరెంట్ అనేది సెన్సార్ యొక్క విస్తృత కరెంట్ పరిధి విద్యుత్ మరియు ప్రాథమిక సర్క్యూట్‌లను సమన్వయము చేస్తుంది.వినియోగదారు భద్రతను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడిన సెన్సార్ 1 A వరకు ప్రవాహాలను కొలవడానికి ఉపయోగించబడుతుంది మరియు అంతర్నిర్మిత ఓవర్‌లోడ్ రక్షణను కలిగి ఉంటుంది.కరెంట్ పూర్తి సర్క్యూట్‌లో మాత్రమే ఉంటుంది కాబట్టి, కరెంట్‌ని కొలవడానికి వైర్‌లెస్ కరెంట్ సెన్సార్ తప్పనిసరిగా ఆ సర్క్యూట్‌లో భాగం అయి ఉండాలి.ఇది శ్రేణిలో కనెక్ట్ చేయబడింది మరియు చాలా తక్కువ నిరోధకత (0.1 Ω) కలిగి ఉంటుంది.ఈ కారణంగా, రెసిస్టివ్ లోడ్ లేకుండా బ్యాటరీ లేదా ఇతర వోల్టేజ్ మూలానికి నేరుగా కనెక్ట్ చేస్తారు.

ఈ విధంగా అది పనిచేస్తుందని చెబుతున్నారు.

మోకాలి నొప్పులు నివారించాలంటే.. ఇలా చెయ్యండి..!
Advertisement