అంతరిక్షంలో ఉంటే నిత్య యవ్వనంగా ఉంటారా..? సైన్స్ చెబుతోంది ఇదే

ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 ( Chandrayaan-3 )చంద్రుడిపై ల్యాండ్ అయిన విషయం తెలిసిందే.రోవర్ చంద్రుడిపై తిరుగుతూ ఇప్పటికే పరిశోధనలు చేస్తోంది.

చంద్రుడిపై ఉన్న మట్టిలో ఖనిజాలను ఆన్వేషించనుంది.చంద్రుడిపై హీలియం-3 పుష్కలంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అక్కడి హీలియంను భూమిపైకి తీసుకొస్తే ప్రపంచం మొత్తానికి ఉచితంగా విద్యుత్ అందించవచ్చు.అలాగే చంద్రుడిపై వాతావరణ స్థితిగతులు, ఇతర అంశాలను చంద్రయాన్-3 ద్వారా ఇస్రో( ISRO ) తెలుసుకోనుంది.

భవిష్యత్తులో చంద్రుడిపై మనుషులను పంపించేందుకు ఈ ప్రయోగం కీలకంగా మారనుంది.అయితే చంద్రయాన్-3 సక్సెస్ తర్వాత జనాలకు అంతరిక్షానికి సంబంధించిన అనేక అంశాల గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.

Advertisement
Will You Be Forever Young If You Are In Space This Is What Science Says , Foreve

అనేక విషయాలు తెలసుకునేందుకు గూగుల్ సెర్చ్ చేస్తున్నారు.అంతరిక్షానికి వెళితే వయస్సు పెరగరని, యవ్వనంగానే ఉంటారని చాలామంది అనుకుంటూ ఉంటారు.

అంతరిక్షానికి వెళితే వృద్ధాప్యానికి చేరుకోరనే అపోహ ఒకటి ప్రజల్లో బలంగా ఉంది.దీనిపై నాసా పలు పరిశోధనలు చేసింది.

అందులో ఏముందో ఇప్పుడు చూద్దాం.

Will You Be Forever Young If You Are In Space This Is What Science Says , Foreve

నాసా ( NASA )అనేకమంది వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపింది.వారి ఆరోగ్య పరిస్థితులతో పాటు శరీరంలో వచ్చిన మార్పులపై నాసా అధ్యయనం చేసింది.ఈ రీసెర్చ్‌లో నాసా పలు కీలక విషయాలు కనిపెట్టింది.

చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు వస్తున్నాయా..? అయితే ఈ అలవాట్లు మానేయండి..

అంతరిక్షం నుంచి వచ్చిన వ్యోమగాముల్లో పలు మార్పులు కనిపించాయి.వారిలో రక్తహీనత సర్వసాధారణంగా ఉంటుందని, దీనిని స్పేస్ అనీమియా అని అంటారని నాసా గుర్తించింది.

Advertisement

అలాగే అంతరిక్షంలో వయస్సు పెరగరనే దానిపై కూడా నాసా పరిశోధణలు చేసింది.ఇందుకోసం ఇద్దరు కవల సోదరులను తీసుకుంది.

సోదరుల్లో ఒకరిని అంతరిక్షంలోకి పంపగా.మరొకరిని భూమిపై ఉంచింది.స్కాట్ కెల్లీ ( Scott Kelly )అనే వ్యక్తిని 340 రోజులు అంతరిక్షంలో ఉంచగా.

అతడి సోదరుడు మార్క్‌ను భూమిపై ఉంచింది.స్కాట్ కెల్లీ అంతరిక్షం నుంచి రాగానే అతడిని పరీక్షించగా.

అతడి డీఎన్‌ఏలో మార్పులు కనిపించినట్లు గుర్తించారు.భూమికి వచ్చిన ఆరు నెలల తర్వాత స్కాట్ కెల్లీ జీన్స్ లో మార్పులు సాధారణ స్థితికి చేరుకున్నాయి.

దీంతో ఎక్కువకాలం అంతరిక్షంలో ఉంటే శరీరంలో మార్పులు చోటుచేసుకోవడం వల్ల యవ్వనంగా కనిపించేందుకు అవకాశాలున్నాయని అంటున్నారు.

తాజా వార్తలు