కొత్త హీరోతో సినిమా చేయడానికి కూడా సిద్ధమే.. రాజమౌళి షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ( Director SS Rajamouli )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ప్రస్తుతం జక్కన్న వరుసగా సినిమాలను తెరకెక్కిస్తూ ఫుల్ బిజీబిజీగా ఉన్నారు బాహుబలి సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిన విషయం తెలిసిందే.

అంతేకాకుండా పాన్ ఇండియా సినిమాల ట్రెండు మొదలైంది, మొదలుపెట్టింది కూడా జక్కన్ననే అని చెప్పాలి.ఒకప్పుడు మర్యాద రామన్న వంటి చిన్న చిన్న సినిమాలు తెరకెక్కించిన రాజమౌళి ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కిస్తున్నారు.

ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి దర్శకుడయ్యాడు.

Will Work With New Hero If Script Demands Rajamouli, Rajamouli, Tollywood, Young

అయితే మరి ఇలాంటి సమయంలో దర్శకుడు రాజమౌళి కొత్త హీరోతో సినిమా చేస్తాడా అన్న ప్రశ్న ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.రాజమౌళితో ఏ హీరో అయినా సినిమా చేశాడు అంటే ఆ హీరో క్రేజ్ పెరిగిపోవడం ఖాయం.హీరోలు సైతం రాజమౌళితో సినిమా చేయడానికి ఆసక్తిని చూపిస్తూ ఉంటారు.

Advertisement
Will Work With New Hero If Script Demands Rajamouli, Rajamouli, Tollywood, Young

మరి అలాంటి రాజమౌళి ఒక చిన్న హీరోతో సినిమాలు చేస్తాడా అన్న ప్రశ్నలు తలెత్తుతున్న సమయంలో అలాంటి అనుమానాలు ఏమి పెట్టుకోవద్దు అంటున్నారు జక్కన్న.తన కథకు కొత్త హీరో అయితే బాగుంటాడనిపిస్తే కొత్త హీరో తినే సినిమా చేస్తానని ఆ విషయంలో మరో ప్రశ్నకు తావు లేదని తెలిపారు జక్కన్న.

Will Work With New Hero If Script Demands Rajamouli, Rajamouli, Tollywood, Young

కొత్త హీరోతో చేయకూడదని లేదు.కథను బట్టి హీరో ఎంపిక ఉంటుంది.కథకు కొత్త హీరో బాగుంటాడనుకుంటే కొత్త ఫేస్ నే తీసుకుంటాను.

కొత్త హీరోతో చేయకూడదు, చేస్తే రీచ్ ఉండదు, బడ్జెట్ పరిమితులు ఉంటాయి లాంటి అంశాల్ని నేను పట్టించుకోను.నా స్క్రిప్ట్ కు కొత్త హీరో బాగుంటాడనిపిస్తేనే కొత్త ముఖాన్ని తీసుకుంటాను.

కొత్త హీరోతో కూడా నన్ను నేను ప్రూవ్ చేసుకోగలను అని నిరూపించుకోవడం కోసం మాత్రం సినిమా చేయను అని చెప్పుకొచ్చారు జక్కన్న.ఈ సందర్భంగా ఆయన చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు