ఏపీ అధికార పార్టీ వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తూ ఆ పార్టీ తరఫున యాక్టివ్ గా ఉంటూ రాజకీయ ప్రత్యర్థులు చేసే విమర్శలను తిప్పికొడుతూ ఢిల్లీ స్థాయిలోను కేంద్ర బీజేపీ పెద్దలతో సన్నిహితంగా మెలుగుతూ, వైసిపి ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటూ వస్తున్నారు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయి రెడ్డి.
జగన్ కు అత్యంత సన్నిహితులుగా ముద్రపడిన విజయసాయిరెడ్డి జగన్ అక్రమాస్తుల కేసుల్లో జగన్ తో పాటు జైలుకు వెళ్లారు.
వైసిపి ప్రతిపక్షంలో ఉన్న సమయంలోను పార్టీకి ఆయన ఎంతగానో సేవలు అందించారు. దాని కారణంగానే జగన్ ఆయనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ పార్టీలో నెంబర్ 2 పొజిషన్ ఇచ్చారు.
అయితే గత కొంతకాలంగా చూస్తే విజయ్ సాయి రెడ్డి ప్రాధాన్యం క్రమక్రమంగా తగ్గుతూ వస్తున్నట్టుగా కనిపిస్తోంది.ఆ స్థానంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రాధాన్యం పెరుగుతూ వస్తోంది.
దీంతో విజయసాయిరెడ్డి హవా ఇక పూర్తిగా వైసిపిలో తగ్గిపోయిందని ప్రచారం జరుగుతుంది.దీనికి తగ్గట్లుగానే కొన్ని వ్యవహారాలు చోటుచేసుకుంటున్నాయి.
వైసిపి సోషల్ మీడియా విభాగాన్ని లీడ్ చేస్తూ వచ్చిన విజయసాయిరెడ్డి ని ఇప్పుడు ఆ విభాగం నుంచి తప్పించారు.ఆ స్థానాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ్ రెడ్డికి అప్పగించారు.
వైసీపీ సోషల్ మీడియా పేరుతో చేసిన కొత్త నియామకాలు కార్యక్రమానికి విజయసాయిరెడ్డి హాజరు కాలేదు.
మొత్తం వ్యవహారాలన్నిటిని సజ్జల రామకృష్ణారెడ్డి చూసుకున్నారు. ఇప్పుడు విజయ్ సాయి రెడ్డి పరిస్థితి ఇప్పుడు వైసీపీలో ఇబ్బందికరంగా మారింది.అయితే ఒక్కసారిగా విజయసాయిరెడ్డి ప్రభావం వైసీపీలో తగ్గిపోవడానికి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభావం పెరగడానికి కారణం ఏమిటనే దానిపైనే రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి .మొదట్లో విజయసాయిరెడ్డికి జగన్ అత్యధికంగా ప్రాధాన్యం ఇచ్చిన ఆయన వ్యవహారాలు వైసీపీకి ఇబ్బందికరంగా మారడంతోనే విజయసాయి కి ప్రాధాన్యం బాగా తగ్గిందట.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy