27 ఏళ్ల కష్టం.. ఎన్నో ఎదురుదెబ్బలు.. నితిన్ మూవీతో వక్కంతం వంశీ స్టార్ స్టేటస్ అందుకుంటారా?

ఏ రంగంలోనైనా కష్టపడితే కొంత వేగంగా ఫలితం దక్కుతుంది కానీ సినిమా రంగంలో మాత్రం కష్టానికి ఫలితానికి సంబంధం ఉండదు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో రైటర్ గా తనకంటూ గుర్తింపును సొంతం చేసుకున్న వాళ్లలో వక్కంతం వంశీ( Vakkantham Vamsi ) ఒకరు.

ఎన్నో హిట్ సినిమాలకు రైటర్ గా పని చేసిన వక్కంతం వంశీ దాసరి నారాయణరావు దర్శకత్వంలో కల్యాణ ప్రాప్తిరస్తు సినిమాలో హీరోగా నటించారు.పుంగనూరు సమీపంలోని అరికెల గ్రామంలో జన్మించిన వక్కంతం వంశీ బాల్యంలోనే నాటకాలలో నటించారు.

చిత్రం భళారే విచిత్రంలో కెమెరా ముందు తొలిసారి కనిపించిన వక్కంతం వంశీ రంగవల్లి అనే సినిమాలో బిచ్చగాడి పాత్రలో నటించి మెప్పించారు.కల్యాణ ప్రాప్తిరస్తు సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో వక్కంతం వంశీ నటుడిగా సక్సెస్ కాలేదు.

కిక్, రేసుగుర్రం, టెంపర్ సినిమాలు( Temper ) రైటర్ గా వక్కంతం కెరీర్ ను మార్చేశాయి.నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో డైరెక్టర్ గా వక్కంతం వంశీ కెరీర్ ను మొదలుపెట్టారు.27 సంవత్సరాలు కష్టపడగా వక్కంతం వంశీకి ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి.నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో వక్కంతం వంశీ ఎదుర్కొన్న విమర్శలు అన్నీఇన్నీ కావు.

Advertisement

జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) సినిమాకు పని చేసే ఛాన్స్ వచ్చినట్టే వచ్చి పోయింది.

వక్కంతం వంశీ ఎక్స్ట్రా ఆర్డినర్ మ్యాన్ టీజర్( Extra Ordinary Man ) తో మెప్పించారు.ఈ సినిమా టీజర్ లో బాహుబలి సాంగ్ లో నితిన్ ను చూపించడం ప్రేక్షకులను ఆకట్టుకుంది.పవన్, ప్రభాస్ ఫ్యాన్స్ మనస్సు గెలుచుకున్న నితిన్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.

వక్కంతం వంశీ 27 ఏళ్ల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.ఈ సినిమాతో వక్కంతం వంశీకి స్టార్ స్టేటస్ దక్కుతుందేమో చూడాల్సి ఉంది.

Garam masala : భారతీయులు ఉపయోగించే గరం మసాలాతో.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా..!
Advertisement

తాజా వార్తలు