సిద్ధాంతాల పరంగాను భావజాలాల పరంగాను అనేక వైరుధ్యాలన్న ప్రతిపక్ష పార్టీలు ఒక కూటమి లా ఏర్పడిన మొదటి రోజు నుంచి అనేక అవరోధాలు ఆ కూటమి ఐక్యతను ప్రశ్నిస్తూనే ఉన్నాయి.
నిన్న మొన్నటి వరకూ డీఎంకే అధినేత స్టాలిన్ తనయుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు కార్చిచ్చు గా మారి కూటమి ఐక్యతకు మొదటిసారి పరీక్ష పెట్టగా ఇప్పుడు ఆమ్ ఆద్మీ( AAP ) మరియు కాంగ్రెస్( Congress ) మధ్య పంజాబ్లో రాష్ట్రం లో ఏర్పడిన చిచ్చు దావానం లా మారే అవకాశం కనిపిస్తుంది.
పంజాబ్లో అధికారంలో ఉన్న ఆప్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పై పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ ప్రతాప్ సింగ్ బాజ్వా( Pratap Singh Bajwa ) చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి.
భగవంత్ మాన్( CM Bhagwant Mann ) ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఈ ప్రభుత్వ మనుగడ రెండు నెలలు కూడా ఉండదని, ఇప్పటికే తనతో 30 మంది ఆప్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.అంతేకాకుండా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ నే గెలిపించాలని పంజాబ్ ప్రజలను ఆయన కోరారు.దీనిపై ఆప్ ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందించింది .తన ముఖ్యమంత్రి కలలు కల్లలు అయినందుకే అతను ఇలాంటి తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రలు చేస్తున్నారని అతనికేమైనా ఇబ్బందులు ఉంటే హై కమాండ్ తో మాట్లాడుకోవాలంటూ సీఎం భగవంత్ మాన్ వ్యాఖ్యానించారు.
ఇప్పుడు కూటమిలోని కీలక పార్టీల మధ్య మొదలైన ఈ గొడవ కూటమి ఐక్యత పై ప్రభావం చూపుతుందని కూటమి సభ్య పార్టీలు ఆందోళన చెందుతున్నాయి.అంతేకాకుండా మరో రెండు నెలల్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున కూటమి సమర్ధతకు మొదటి పరీక్షగా ఎదురవ్వబోతుంది .ఇలాంటి కీలక సమయంలో కూటమి పార్టీల మధ్య పోరు తగదని విశ్లేషణలు వస్తున్నాయి.దీనిపై స్పందించిన ఎన్సిపి అధినేత శరద్ పవార్( Sharad Pawar ) ఇలాంటివి జరగకూడదని ఒప్పుకుంటూనే ఈ గొడవలు ఇండియా కూటమి( India Alliance ) పనితీరుపై ఎలాంటి ప్రభావం చూపవంటూ తేల్చేశారు.
రాజకీయాల్లో ఇలాంటివన్నీ మామూలే అని ఇలాంటి చిన్న చిన్న గొడవలు తమ అతిపెద్ద లక్ష్యాన్ని చెరపలేవు అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy