రాజశేఖర్ కూతుర్లు సినిమా ఇండస్ట్రీ లో రాణించగలుగుతారా..?

రాజశేఖర్( Rajasekhar ) ఒకప్పుడూ యాంగ్రీ యంగ్ మ్యాన్ క్యారెక్టర్లు చేస్తూ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

హీరో గా మంచి పీక్స్ టైం లో ఉన్నప్పుడు చిరంజీవి( Chiranjeevi ) లాంటి మెగాస్టార్ తో పోల్చుకుంటే నేను ఎవ్వరికీ తక్కువ కాదు అన్నట్టు గా ఉండేది ఆయన ప్రవర్తన.

అది గమనించిన దర్శక, నిర్మాతలు ఆయన్ని మెల్లగా పక్కకి పెట్టడం స్టార్ట్ చేశారు దానికి తగ్గట్టు గానే ఆయనకి హిట్స్ కూడా పడటం తగ్గాయి.ఇక మెల్ల మెల్ల గా ఆయన స్టార్ డమ్ కూడా చాలా తగ్గిపోయింది అనే చెప్పాలి.

ఇక ఇది ఇలా ఉంటే రాజశేఖర్ భార్య అయిన జీవిత( Jeevitha ) కూడా సినిమా హీరోయిన్ అనే విషయం మనకు తెలిసిందే.వీళ్లిద్దరి కాంబినేషన్ లో కూడా చాలా సినిమాలు వచ్చాయి.అందులో అంకుశం సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

అయితే వీళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్న విషయం మనకు తెలిసిందే.ఇక రాజశేఖర్ తర్వాత సినిమా ఇండస్ట్రీ లో ఆయన పరం పరని కొనసాగిస్తు వాళ్ళు కూడా ఇండస్ట్రీ కి వచ్చారు.

Advertisement

అయితే విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన దొరసాని( Dorasani ) సినిమాలో రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అయినప్పటికీ ఆర్టిస్ట్ గా శివాత్మిక కి మంచి పేరు వచ్చిందనే చెప్పాలి.

ఇక రాజశేఖర్ పెద్ద కూతురు శివాని కూడా రాజ్ తరుణ్( Raj Tarun ) హీరో గా వచ్చిన అహనా పెళ్ళంట అనే ఒక వెబ్ సిరీస్ లో నటించి మెప్పించింది.అయితే ఈ ఇద్దరు కూడా హీరోయిన్స్ గా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఇద్దరిలో ఒకరికి కూడా కమర్షియల్ హిట్ అయితే పడలేదు అయితే ఇది చూసిన జనాలు రాజశేఖర్ కూతుర్లు ఇండస్ట్రీ కి వచ్చారు కానీ ఇక్కడ సక్సెస్ అవ్వగలరా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు.చూడాలి మరి వీళ్ళు ఇండస్ట్రీ లో ఎంతవరకు సక్సెస్ అవుతరానేది.

Advertisement

తాజా వార్తలు