పూరి జగన్నాథ్ మరోసారి తన సత్తా చాటుతాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) పూరి జగన్నాధ్( Puri Jagannath ) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది.

ఆయన చేసిన సినిమాలు ఒకప్పుడు ఇండస్ట్రీలో రికార్డులను సృష్టించాయి.

తక్కువ రోజుల్లో సినిమాలను చేసి భారీ విజయాలను అందుకోవడంలో ఆయనను మించిన వారు మరొకరు ఉండరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేసిన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

ఇక ప్రస్తుతం ఆయన ప్లాపుల్లో ఉన్నాడు.కాబట్టి అతనికి డేట్స్ ఇచ్చే హీరోలు ఎవరూ లేరు అంటు కొన్ని వార్తలైతే వస్తున్నాయి.

నిజానికి ఆయన లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొకరు ఉండనేది వాస్తవం.చాలా తక్కువ రోజుల్లో సినిమాలను చేసి ఇండస్ట్రీ హిట్లను కొట్టగలిగే కెపాసిటి ఉన్న దర్శకుడు కూడా తనే కావడం విశేషం.కానీ గత కొన్ని రోజుల నుంచి ఆయన చేసిన సినిమాలేవి అంత పెద్దగా సక్సెస్ సాధించకపోవడంతో ఆయన చాలా వరకు డీలా పడిపోయాడనే చెప్పాలి.

Advertisement

ఇక యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆయన తనకంటూ ఒక మార్క్ నైతే క్రియేట్ చేసుకున్నాడు.మరి మరోసారి పాన్ ఇండియాలో ఆయన భారీ విజయాన్ని సాధించాలి అంటే మాత్రం చాలా వరకు తీవ్రమైన కసరత్తులు చేయాల్సిన అవసరమైతే ఉంది.

ప్రస్తుతం ఆయన గోపిచంద్( Gopichand ) తో ఒక సినిమా చేయబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.ఇక దాంతో పాటుగా గోపి చంద్ ను హీరోగా పెట్టి మరొక సినిమాను ప్లాన్ చేస్తున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి.ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాలతో ఆయన తనకంటూ ఒక భారీ గుర్తింపును సంపాదించుకుంటాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఈ మూవీ తో సక్సెస్ అయితే మరోసారి ఆయన స్టార్ డైరెక్టర్ గా అవతరిస్తాడు.

శ్రీ కృష్ణ పరమాత్ముడికి ఎంత మంది సంతానమో తెలుసా?
Advertisement

తాజా వార్తలు