సలార్ 2 పృథ్వి రాజ్ సుకుమారన్ పాత్ర చనిపోతుందా..?

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్( Prashanth Neel) దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా భారీ సక్సెస్ ను సాధించడమే కాకుండా వరల్డ్ వైడ్ గా 700 కోట్ల వరకు కలెక్షన్లు కూడా రాబట్టింది.

అయితే ఈ సినిమాకి సీక్వల్ గా సలార్ 2 సినిమా కూడా రాబోతుంది అంటూ సినిమా చివర్లో అనౌన్స్ చేశారు.

అయితే సలార్ 2 సినిమాలో స్టోరీ చాలా డీప్ గా ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.అది ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రి ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తి చేసి పెట్టారట.

ఇక ప్రభాస్ ఉన్న ప్రస్తుత బిజీ వల్ల ఈ సినిమా అనేది కొద్దివరకు లేటవుతుంది.

Will Prithvi Raj Sukumarans Character Die In Salaar 2 ,prashanth Neel , Prithvi

లేకపోతే ఇప్పటికే సెట్స్ మీదికి వెళ్లి ఎప్పుడో షూట్ కూడా కంప్లీట్ చేసుకునేదని సినిమా యూనిట్ భావిస్తున్నారు.ఇక పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన క్యారెక్టర్ చనిపోతుందా లేదంటే బ్రతికే ఉంటాడా అనే అనుమానాలు అయితే ఇప్పుడు వెలువడుతున్నాయి.నిజానికి ప్రభాస్ ఫ్రెండ్ గా పృథ్వి రాజ్ సుకుమారన్ ఈ సినిమాలో నటించాడు.

Advertisement
Will Prithvi Raj Sukumaran's Character Die In Salaar 2 ,Prashanth Neel , Prithvi

అయితే మొదటి పార్ట్ లో వీరిద్దరు ఫ్రెండ్స్ గా కనిపించినప్పటికీ నెక్స్ట్ సెకండ్ పార్ట్ లో శౌర్యంగా పర్వంలో ప్రభాస్( Prabhas ) ఒక రాజ్యానికి రాజుగా కనిపించబోతున్నాడు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య గొడవలు అయితే జరగడానికీ అవకాశాలైతే ఉన్నాయి.

Will Prithvi Raj Sukumarans Character Die In Salaar 2 ,prashanth Neel , Prithvi

కాబట్టి ఈ గొడవలో పృధ్విరాజ్ సుకుమారన్( Prithviraj Sukumaran ) చేసిన పాత్ర చనిపోబోతుంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.మరి వీటిలో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం తెలీదు గానీ సోషల్ మీడియాలో అయితే ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.చూడాలి మరి ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది.

ఇక మొత్తానికైతే సలార్ సినిమా మీద ఉన్న హైప్ కి ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు రాబట్టే అవకాశాలైతే ఉన్నాయి.

హీరో హీరోయిన్స్ గా నటించి అన్నాచెల్లెళ్లుగా చేసిన టాలీవుడ్ యాక్టర్స్
Advertisement

తాజా వార్తలు