ఎన్టీయార్ కెరియర్ సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతుందా..?

సినిమా ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కాని రీతిలో జూనియర్ ఎన్టీఆర్ ( Junior NTR )ఒకప్పుడు మంచి విజయాలను సాధించాడు.

కెరియర్ మొదట్లోనే భారీ విజయాలను అందుకున్న ఆయన 20 సంవత్సరాల వయసులోనే ఇండస్ట్రీ హిట్లు నమోదు చేసుకొని ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఎదుగుతాడు అంటూ గుర్తింపునైతే సంపాదించుకున్నాడు.

కానీ ఆ తర్వాత ఆయనకు వరుసగా ఫ్లాపులు రావడం ఇండస్ట్రీలో సక్సెస్ లను సాధించలేకపోవడం వల్ల ఆయన కెరీర్ అనేది చాలా వరకు డౌన్ ఫాల్ అయిందనే చెప్పాలి.మరి ఇప్పుడు దేవర సినిమాతో( Devara movie ) ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి ఆయనకు ఆ సినిమా కూడా ఆశించిన మేరకు విజయాన్ని సాధించి పెట్టలేదు.

కేవలం ఈ సినిమా 400 కోట్ల కలెక్షన్స్ ను( 400 crore collections ) మాత్రమే రాబట్టడంతో పాన్ ఇండియాలో ఆయన మార్కెట్ భారీగా లేదని చాలా వరకు తగ్గిపోయిందనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి.ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్ ( Prashanth Neil )తో చేస్తున్న సినిమాతో 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబట్టాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.అయితే ఈ సినిమా మీద మొదటి నుంచే భారీ బజ్ క్రియేట్ చేయాలని తద్వారా ప్రమోషన్స్ కూడా భారీ లెవెల్లో చేయాలనే ఉద్దేశ్యం లో అటు ప్రశాంత్ నీల్, ఇటు ఎన్టీఆర్ ఉన్నట్టుగా తెలుస్తోంది.

మరి ఈ సినిమాని ఇండియా లెవెల్లో ప్రమోషన్స్ నిర్వహించి భారీ హైప్ క్రియేట్ చేసి తద్వారా సినిమాని రిలీజ్ చేస్తే సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుందనే స్ట్రాటజీని మెయింటైన్ చేస్తూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.చూడాలి మరి ఎన్టీఆర్ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది.ఇక ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం.

Advertisement
సంక్రాంతికి వస్తున్నాం ఆ మార్క్ ను టచ్ చేయడం పక్కా.. 2025 బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందా?

తాజా వార్తలు