ఎన్టీయార్ హిట్ కొట్టి రాజమౌళి రికార్డ్ ని బ్రేక్ చేస్తాడా..?

రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్( RRR ) సినిమా ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ మూవీలోని నాటు నాటు పాటను ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఆస్కార్‌ వరించింది.

ఎమ్‌.ఎమ్‌ కీరవాణి, చంద్రబోస్‌ ఆస్కార్‌ అవార్డులు అందుకున్నారు.

దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ నటించారు.ఇక నాటు నాటు లో తారక్ , చరణ్ వేసిన స్టెప్స్ కి ప్రపంచమే ఫిదా అయింది .ఇక ఇద్దరు హీరోలు కూడా గ్లోబల్ స్టార్స్ గా అభిమానుల నీరాజనాలు అందుకుంటున్నారు.ఇక ఇప్పుడు చరణ్ .స్టార్ డైరెక్టర్ శంకర్( Shankar ) తో సినిమా చేస్తున్నాడు .ఎన్టీఆర్ .దర్శకుడు కొరటాలతో ఇటీవలే సినిమా మొదలు పెట్టారు .ఇప్పుడు ఈ సినిమాలపై ఆసక్తికర చర్చ సాగుతుంది .అదేంటి అంటే రాజమౌళి హీరోల సెంటిమెంట్ .రాజమౌళి కెరీర్ మొదటి నుంచి ఓ సెంటిమెంట్ వెంటాడుతూనే ఉంది.చిన్న హీరో అయినా.

స్టార్ హీరో అయినా.రాజమౌళితో సినిమా చేస్తే.

Advertisement

ఆ హీరో తర్వాతి సినిమా ప్లాప్ అవడం ఆనవాయితీగా వస్తుంది .రాజమౌళి సెంటిమెంట్ కి భయపడి .స్టార్స్ ఎంత పక్కాగా ప్లాన్ చేసుకున్నా.

ఇప్పటి వరకూ ఈ సెంటిమెంట్ నుంచి తప్పించుకోలేకపోయారు .ఎంత స్టార్ హీరో అయినా జక్కన్నతో సినిమా తరువాత ప్లాప్ చూడక తప్పలేదు.రాజమౌళి ఇప్పటి వరకూ 12 సినిమాలు చేశారు.

అందులో ఎన్టీఆర్, రామ్ చరణ్,ప్రభాస్ లతోనే ఎక్కువ సినిమాలు చేశారు.ఆరువాత రవితేజ, నానీ, సునిల్, నితిన్ లతో ఒక్కొసినిమా చేశారు.

ఇప్పటి వరకూ వీరిలో ఏ ఒక్కరు కూడా రాజమౌళి తరువాత సినిమా హిట్టు కొట్టలేదు.ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తో రామ్ చరణ్, ఎన్టీఆర్ అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని దక్కించుకున్నారు .ఇంత పెద్ద హిట్టుతో గ్లోబల్ స్టార్ గామారిన రామ్ చరణ్.ఆర్ఆర్ఆర్ తరువాత చేసిన ఆచార్య డిజాస్టర్ అయ్యింది.

అక్కినేని ఫ్యామిలీ హీరోలకు ముందుకి వెళ్లే ఛాన్స్ లేదా??

అయితే అది మెగాస్టార్( Megastar ) మూవీ గానే ఆడియెన్స్ చూశారు .ఇప్పుడు శంకర్ మూవీ ఫలితం పై మెగాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు .ఇక ఎన్టీఆర్ రాజమౌళితో నాలుగు సినిమాలు చేశాడు.దీంట్లో మూడు సినిమాలకు రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది.

Advertisement

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ తరువాత కొరటాల శివతో ఎన్టీఆర్ సినిమా స్టార్ట్ చేశాడు.ఈ మూవీ ఫలితంపై కూడా చర్చలు సాగుతున్నాయి .రామ్ చరణ్ .రాజమౌళి తో మగథీర చేసిన తరువాత వరుస ప్లాప్ లు ఎదురయ్యాయి.మరి ఈ సారైనా వీరు దీనిని అధిగమిస్తారో లేదో చూడాలి.

తాజా వార్తలు