టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో ప్రస్తుతం టాప్ రెమ్యునరేషన్ ను అందుకుంటున్న హీరోయిన్ ఎవరనే ప్రశ్నకు నయనతార (nayanatara)పేరు సమాధానంగా వినిపిస్తుంది.
నయన్ రెమ్యునరేషన్ 8 కోట్ల రూపాయలు అని 10 కోట్ల రూపాయలు అని తరచూ వార్తలు ప్రచారంలోకి వస్తుంటాయి.
ధనుష్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ నయనతార చేసిన కామెంట్లకు ధనుష్ ఫ్యాన్స్ తమదైన శైలిలో జవాబిస్తున్నారు.ధనుష్ నేనూ రౌడీనే సినిమాకు నిర్మాత అని ఆ సినిమాపై అన్ని హక్కులు అతనికే ఉంటానని సినిమా అనేది వ్యాపారమని ధనుష్ ఫ్యాన్స్(Dhanush fans) చెబుతున్నారు.
నయనతార సైతం ఏ సినిమాకు అంగీకరించినా తాను ప్రమోషన్స్ లో పాల్గొననని షరతు పెడుతుందని ఈ విధంగా ఆమె నిర్మాతలను ఇబ్బంది పెడుతోందని చెబుతున్నారు.అదే సమయంలో సొంత బ్యానర్ సినిమాలకు మాత్రం ఆమె ప్రమోషన్స్ చేస్తుందని ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు.
చాలామంది దర్శకనిర్మాతలు నయనతార ఇబ్బంది పెట్టడం వల్ల బాధ పడ్డారని ఆ బాధను అర్థం చేసుకోని నయనతార ఇప్పుడు మాత్రం సింపతీ డ్రామా ప్లే చేస్తోందని కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం ఆమె నటించిన డాక్యుమెంటరీలో ఆమె ఫ్రీగా నటించారా అని ధనుష్ ఫ్యాన్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.ధనుష్ కు (Dhanush)అభ్యంతరం ఉంటే ఆ షాట్స్ ను వాడుకోవాల్సిన అవసరం ఏముందని వాళ్లు ప్రశ్నిస్తున్నారు.
నయనతార కావాలనే ధనుష్ ను బ్యాడ్ చేసే విధంగా అడుగులు వేస్తోందనే కామెంట్లు సైతం వ్యక్తమవుతున్నాయి.నయనతార పక్కా కమర్షియల్ హీరోయిన్ అని సమస్య ఆమెదైతే విలువల గురించి మాట్లాడటం ఎంతవరకు రైట్ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.ఇతర హీరోయిన్లతో పోలుస్తూ నయన్ ను నెటిజన్లు విమర్శిస్తున్నారు.
నయనతార రాబోయే రోజుల్లో ఈ కామెంట్లకు సమాధానం ఇస్తారేమో చూడాల్సి ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy