మోడీకి ఆ దమ్ముందా.. ఛాలెంజ్ ?

తెలంగాణలో బి‌ఆర్‌ఎస్ మరియు బీజేపీ(BRS party ) మద్య కొనసాగుతున్న రాజకీయ వివాదం గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది.

ఈ రెండు పార్టీల మద్య రోజుకొక వివాదం తెరపైకి వస్తుంది.

కే‌సి‌ఆర్ ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలతో కమలనాథులు విరుచుకుపడుతుంటే.అసలు తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో చెప్పాలని బి‌ఆర్‌ఎస్ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు.

ఈ రెండు పార్టీల మద్య ఇలాంటి వాదోపవాదాలు సర్వసాధారణమే అయినప్పటికి.తాజాగా ఐటీ శాఖ మంత్రి కే‌టి‌ఆర్ చేసిన వ్యాఖ్యలు పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ హాట్ చర్చలకు తావిస్తున్నాయి.

ఇటీవల తెలంగాణకు వచ్చిన ప్రధాని మోడీ.కే‌సి‌ఆర్ ప్రభుత్వం( CM KCR )పై ఘాటైన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.తెలంగాణలో అభివృద్ది కుంటు పడిందని, కేంద్రం చేసే అభివృద్ది పనులను, రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని ప్రధాని విమర్శలు గుప్పించారు.

Advertisement

కుటుంబ పాలనతో అభివృద్ది సాధ్యం కాదని చెబుతూనే, కే‌సి‌ఆర్ పాలనలో తెలంగాణ అత్యంత వెనుకబడిందని చెప్పుకొచ్చారు మోడీ.

తాజాగా మోడీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ కే‌సి‌ఆర్ చేసిన ట్వీట్ బీజేపీ నేతలను కలవర పెడుతోంది.తెలంగాణలో కే‌సి‌ఆర్ సాధించిన అభివృద్దిని తెలిపేలా ఏ ఏ రంగాల్లో తెలంగాణ అగ్రపథంలో ఉంది.ఇతర రస్త్రాలతో పోలిస్తే తెలంగాణ ఏ స్థాయిలో మెరుగ్గా ఉందని అనే విషయాలను కులాంకుశంగా తెలిపేలా ట్వీట్ చేశారు.

ఈ విధంగా తెలంగాణలో సాధించిన అభివృద్ది బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగిందా ? ఒకవేళ జరిగిఉంటే ఆధారాలు చూపండి అంటూ కే‌టి‌ఆర్ సవాల్ విసిరారు.మోడి పాలనలో ఈ 9 ఏళ్ల కాలంలో ఏ ఏ రాష్ట్రాలు ఎంత అభివృద్ది సాధించయో బీజేపీ నేతలకు చెప్పే దమ్ముందా ? కనీసం మోడి అయిన చెప్పగలరా ? అంటూ కే‌టి‌ఆర్( KTR ) ట్విట్ చేశారు అయితే కే‌టి‌ఆర్ చేసిన ట్వీట్ పై బీజేపీ నేతలు ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో.ఛాలెంజ్ ను స్వీకరించలేని స్థితిలో బీజేపీ నేతలు ఉన్నారంటే.

మోడి పాలనలో అభివృద్ది శూన్యంగా ఉందనే విషయం స్పష్టమౌతుంది అంటూ కే‌టి‌ఆర్ చెప్పుకొచ్చారు.మొత్తానికి తెలంగాణ అభివృద్ది విషయంలో కే‌టి‌ఆర్ చేసిన సవాల్ కు, బీజేపీ నేతలు స్పందిస్తారో లేదో చూడాలి.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!
Advertisement

తాజా వార్తలు