కవితమ్మకు బెయిల్ వస్తుందా రాదా ? నేడు ఏం తేలనుందో ? 

ఢిల్లీ లిక్కర్ స్కామ్( Delhi Liquor Scam ) కేసులో అరెస్ట్ అయ్యి జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్న బి.ఆర్.

ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ వస్తుందా రాదా అనే విషయం రాజకీయంగానూ హాట్ టాపిక్ గా మారింది.రిమాండ్ లో ఉన్న కవిత తనకు మధ్యంత బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరుతూ కోర్టులో పిటిషన్ వేయడంతో నేడు ఈ బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది.

దీంతో కవితకు బెయిల్ వస్తుందా రాధా అనేది క్లారిటీ రానుంది .ప్రస్తుతం కవిత తీహార్ జైలులో ఉన్నారు.తన కుమారులకు పరీక్షలు ఉన్నాయని, కాబట్టి తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కవిత పిటిషన్ వేశారు .ఢిల్లీ హౌస్ అవెన్యూ కోర్టు( Rouse Avenue Court )లో మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది .ఏప్రిల్ 16 వరకు తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరుతూ ఆమె కోర్టులో పిటిషన్ వేశారు.ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కవితకు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యంతర బెయిల్ ఇవ్వద్దంటూ అభ్యంతరాలు తెలిపే అవకాశం కనిపిస్తోంది.

 ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారం కీలక దశలో ఉన్న నేపథ్యంలో , సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఈడి తరఫున వాదించే అవకాశం కనిపిస్తోంది.కవిత బెయిల్ పై బయటకు వెళితే .సాక్షులను ప్రభావితం చేస్తే .విచారణ పైన దాని ప్రభావం ఉంటుందని ఈడీ తరపున న్యాయవాదులు వారించబోతున్నారు.దీంతో కవితకు బెయిల్ వస్తుందా రాధా అనే విషయంలో అందరిలోనూ ఉత్కంఠ కలుగుతుంది.

Advertisement

కవితను మార్చి 15న హైదరాబాద్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేశారు .ఆ తర్వాత రోజు ఆమెను ఢిల్లీ హౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచారు.

 ముందుగా విచారణ నిమిత్తం 10 రోజులపాటు ఈడీ కష్టడికి న్యాయస్థానం అనుమతించింది.సుప్రీంకోర్టు లో బెయిల్ కోసం ఆశ్రయించినా, ట్రయిల్ కోర్టుకు వెళ్లాలని సూచించడంతో,  ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టుకు వెళ్లారు.ఆమె మధ్యంతర బెయిల్ పై నేడు తీర్పు వెలువడనుండడంతో,  బీఆర్ఎస్ నేతల్లో ఉత్కంఠ నెలకొంది.

త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో కవిత అరెస్టు వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు