జనసేన పరువు టిడిపి చేతుల్లో..గట్టెక్కుతారా..?

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారాలు ముగిశాయి.ప్రస్తుతం అందరి చూపు పోలింగ్ పైనే ఉంది.

అయితే తాజాగా జనసేన (Janasena) గురించి ఓ వార్త రాజకీయ నేతలు మాట్లాడుకుంటున్నారు.ఇక జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తప్పో ఒప్పో తెలియకుండా తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టారు.

బిజెపితో పొత్తు పెట్టుకుని 8 సీట్లను ఆశించారు.ఇక ఎనిమిది సీట్లలో కూడా గెలుస్తారు అనే నమ్మకం లేదు.

అయితే తెలంగాణ ఎన్నికల్లో( Telangana Elections ) ఒక్క సీటు గెలవకపోయినా ఆ ప్రభావం కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పడుతుంది.ఇక ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి మనకు తెలిసిందే.

Advertisement
Will Janasena Honor Be In The Hands Of TDP Details, Janasena, Pawan Kalyan, Prem

ఇక ప్రచారం ఇవాళ్టి తో ముగియనుంది.ఈ నేపథ్యంలోనే ఈరోజు పవన్ కళ్యాణ్ కూకట్ పల్లి లో రోడ్ షో నిర్వహించారు.

ఇక్కడ జనసేన అభ్యర్థిగా ప్రేమ్ కుమార్ (Prem Kumar) బరిలో ఉన్నారు.ఇక ఈయన ను గెలిపించాలని పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు.

అయితే ఇదే కూకట్పల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాధవరం కృష్ణారావు పోటీ చేస్తున్నారు.అయితే కూకట్పల్లిలో చాలామంది టీడీపీ అభిమానులు ఉన్నారు.

ఇక టిడిపి సానుభూతిపరులు జనసేన అభ్యర్థి కి ఓట్లు వేస్తే జనసేన పార్టీ అక్కడ గెలుస్తుంది.లేకపోతే ఆ ప్రభావం ఏపీ రాజకీయాలపై కచ్చితంగా పడుతుంది అని పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!

ఇక ఇక్కడున్న అసలు చిక్కు ఏంటంటే బిఆర్ఎస్ తరఫున బరిలో ఉన్న మాధవరం కృష్ణారావు (Madhavaram Krishna Rao) కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు.

Will Janasena Honor Be In The Hands Of Tdp Details, Janasena, Pawan Kalyan, Prem
Advertisement

దీంతో ఇక్కడున్న వాళ్ళందరూ ఈయనకు ఓట్లు వేసే అవకాశం ఎక్కువగా ఉంది.ఇక టిడిపి (TDP) పై ఎంత అభిమానం ఉన్నా కూడా సొంత సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని విడిచిపెట్టి జనసేన పార్టీ కి పట్టం కట్టరని అర్థమయిపోయింది.అయితే ఇక్కడ టిడిపి సానుభూతిపరుల ఓట్లే కీలకం.

అందుకే జనసేన పార్టీ పరువు ఇప్పుడు టిడిపి చేతుల్లో ఉంది అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఇక్కడ జనసేన అభ్యర్థి గెలవకపోయినా పర్వాలేదు .

కానీ బీఆర్ఎస్ (BRS) పార్టీకి చెందిన అభ్యర్థికి గట్టి పోటీ ఇవ్వగలగాలి.ఇక డిపాజిట్ గల్లంతయితే జనసేన పరువు పూర్తిగా పోతుంది.ఇక ఈ ప్రభావం ఏపీ రాజకీయాలపై పడుతుంది అని జనసేన పార్టీ నాయకులు భావిస్తున్నారట.

అందుకే టిడిపి చేతుల్లోనే జనసేన పరువు ఉంది అని, ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ గట్టెక్కుతుందో లేదో అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.మరి ఇక్కడ టిడిపి సానుభూతి పరులు ఏ పార్టీకి పట్టం కడతారో చూడాలి.

తాజా వార్తలు