దేవర జనాల్లోకి స్లో పాయిజన్ లా ఎక్కుతుందా..?

తెలుగు సినిమా అనగానే మనందరికీ గుర్తుచేది నందమూరి ఫ్యామిలీ. వీళ్ల నుంచి ఏ ఒక్క హీరో సినిమా వచ్చిన కూడా ప్రేక్షకులందరూ బ్రహ్మరథం పడుతూ ఉంటారు.

ఇక జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) హీరోగా కొరటాల శివ( Koratala Siva ) దర్శకత్వంలో వచ్చిన దేవర సినిమా( Devara ) విషయంలో కూడా అదే జరిగింది.ప్రస్తుతం దేవర సినిమాకు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ పరంగా మాత్రం దుమ్ము లేపుతుందనే చెప్పాలి.

ఇక ఇప్పటికే 200 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టిన ఈ సినిమా లాంగ్ రన్ లో భారీ సక్సెస్ ని సాధించి 600 కోట్ల వరకు కలెక్షన్స్ రాబడుతుందనే అంచనాలైతే ఉన్నాయి.

Will Devara Get Into The People Like A Slow Poison Details, Devara Movie, Jr Ntr

ఇక వాటికి తగ్గట్టుగానే ఈ సినిమాకి ప్రేక్షకులైతే బ్రహ్మరథం పడుతున్నారు.నిజానికి ఈ సినిమా విషయంలో జూనియర్ ఎన్టీఆర్ చాలా వరకు పొరపాటు చేశారని చాలా మంది అంటుంటే, మరి కొందరు మాత్రం స్లో పాయిజన్ లా ఈ సినిమా మెల్లిగా జనాల్లోకి ఎక్కుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు .మొదట డివైడ్ టాక్ తెచ్చుకున్న చాలా సినిమాలు ఆ తర్వాత సూపర్ హిట్ గా ఇండస్ట్రీ హిట్లుగా కూడా నిలిచిన సంఘటనలు చాలానే ఉన్నాయి.

Will Devara Get Into The People Like A Slow Poison Details, Devara Movie, Jr Ntr
Advertisement
Will Devara Get Into The People Like A Slow Poison Details, Devara Movie, Jr Ntr

కాబట్టి ఈ సినిమా కూడా అలానే నిదానంగా సక్సెస్ టాక్ తెచ్చుకొని భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలుస్తుందని చాలామంది భావిస్తున్నారు.జూనియర్ ఎన్టీఆర్ కి కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆయనకు పాన్ ఇండియా( Pan India ) మార్కెట్ ను పెంచడంలో హెల్ప్ అవుతుంది.ఇక ఈ సినిమా లేకపోతే మాత్రం ఆయన మార్కెట్ భారీగా తగ్గిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి.

చూడాలి మరి ఈ సినిమా లాంగ్ రన్ లో ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేస్తుంది అనేది.

Advertisement

తాజా వార్తలు