కాంగ్రెస్ " ఘర్ వాపసీ ".. సక్సస్ అవుతుందా?

కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ( Karnataka Congress party ) విజయం సాధించిన తరువాత.ఆ పార్టీలో పెరిగిన జోష్ అంతా ఇంతా కాదు.

ముఖ్యంగా కర్నాటక విజయం టి కాంగ్రెస్( T Congress ) నేతలకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.ప్రస్తుతం తెలంగాణలో హస్తం నేతలు కలిసిమెలసి దూకుడుగా వ్యవహరిస్తున్నారంటే దానికి ప్రధాన కారణం కర్నాటక విజయమనే చెప్పాలి.

ఇక తెలంగాణలో కూడా ఇదే దూకుడు కొనసాగించాలని పార్టీ గట్టి పట్టుదలగా ఉంది.అయితే గతంలో పార్టీ బలహీనత కారణంగా చాలమందినేతలు కాంగ్రెస్ వీడి ఇతర పార్టీల గూటికి చేరారు.

దాంతో కీలక నేతలు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది.

Will Congress Ghar Wapsi Succeed Details, Telugu Political Latest News,congress
Advertisement
Will Congress Ghar Wapsi Succeed Details, Telugu Political Latest News,Congress

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏలేటి మహేశ్వర రెడ్డి, దాసోజు శ్రవణ్, కొండా విశ్వేశ్వర రెడ్డి వంటి ఎంతో మంది సీనియర్స్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.అయితే చాలా నియోజిక వర్గాలలో బలమైన నేతలు లేని కారణంగా కాంగ్రెస్ కు రావలసిన మైలేజ్ రావడం లేదని భావనలో హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.అందుకే పార్టీ నుంచి వెళ్ళిన నేతలను తిరిగి పార్టీలోకి చేర్చుకునేందుకు " ఆపరేషన్ ఘర్ వాపసి "( Operation Gar vapasi ) ని మొదలు పెట్టింది.

పార్టీని వీడిన వారు తిరిగి పార్టీలోకి రావాలని, వారికి తగిన ప్రదాన్యం ఇస్తామని ఇప్పటికే రేవంత్ రెడ్డి( Revanth reddy ) స్పష్టతనిచ్చారు కూడా.అయితే పార్టీని వీడి బిజెపి గూటికి చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రేడ్డి, కొండ విశ్వేశ్వర రేడ్డి, వివేక్ వంటి వాళ్ళు తిరిగి కాంగ్రెస్ లో చేరే ప్రసక్తే లేదని చేల్చి చెప్పారు.

Will Congress Ghar Wapsi Succeed Details, Telugu Political Latest News,congress

అయితే ఆపరేషన్ ఘర్ వాపసి వ్యూహాన్ని హస్తం హైకమాండ్ అమలు చేస్తుడడంతో పార్టీ వీడిన నేతలు తిరిగి కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నాయి.ఎందుకంటే ప్రస్తుతం బిజెపిలో ఉన్న రాజగోపాల్ రేడ్డి, ఈటెల రాజేంద్ర, ఏలేటి మహేశ్వర రేడ్డి, కొండ విశ్వేశ్వర రేడ్డి వంటి వారికి పెద్దగా ప్రదాన్యం లేదు.కాబట్టి ఎన్నికల సమయానికి వీరంతా బీజేపీని వీడిన ఆశ్చర్యం లేదు.

ఒకవేళ వీరు పార్టీని విడితే కాంగ్రెస్ లో చేరడం తప్పా వేరే దారి లేదు.ఆప్షన్ లో బి‌ఆర్‌ఎస్ ఉన్నప్పటికి కూడా వీరంతా గతంలో కాంగ్రెస్ లో ఉన్నవారు కావడంతో కాంగ్రెస్ పార్టీలో చేరడానికే ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉంది.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

మొత్తానికి కాంగ్రెస్ చేపడుతున్న " ఆపరేషన్ ఘర్ వాపసి " ముందు రోజుల్లో సక్సస్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు