" జగనన్న కు చెబితే.." పట్టించుకుంటారా ?

ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) ప్రజాకర్షణ కోసం చేపడుతున్న కార్యక్రమాలు అన్నీ ఇన్ని కావు.

వచ్చే ఎన్నికల్లో కూడా మరోసారి విజయమే లక్ష్యంగా ఉన్న సి‌ఎం జగన్.

ప్రతి కార్యక్రమాన్ని కూడా వ్యూహాత్మకంగానే చేపడుతున్నారు.గడప గడపకు మన ప్రభుత్వం, మా నమ్మకం నువ్వే జగన్, ఇలా ప్రతి కార్యక్రమం కూడా ప్రజాక్షేత్రంలో నిర్వహించేవే.

అయితే ప్రజాకర్షణే లక్ష్యంగా చేస్తున్న ఈ కార్యక్రమాలకు అనుకున్న రీతిలో ప్రజామద్దతు లభించడం లేదనేది పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట.

గడపగడపకు( Gadapa Gadapaki Mana Prabhutvam ) తిరుగుతున్న ఎమ్మెల్యేలపై ప్రజాగ్రహం, ఇంటింటికి స్టిక్కర్ల కార్యక్రమంపై కూడా వ్యతిరేకత.ఇలా పబ్లిసిటీ లక్ష్యంగా జగన్ చేపడుతున్న కార్యక్రమాలన్నీ బెడిసికొడుతున్నప్పటికి మరో కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే." జగనన్నకు చెబుదాం ( Jaganannaku Chebudam )" పేరుతో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కొత్త కార్యక్రమాన్ని తాజాగా ప్రారంభించారు సి‌ఎం జగన్.1902 నెంబర్ కు కాల్ చేసి ప్రజలు తమ సమస్యలను నేరుగా ప్రభుత్వానికి విన్నవించుకోవడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.అయితే ఇదే విధంగా గతంలో స్పందన అనే గ్రీవెన్స్ వేదికను కూడా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.

Advertisement

అయితే ఈ స్పందన కార్యక్రమంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు.

పేరుకే ప్రజా సమస్యల పరిష్కార వేదిక అని, స్పందన ద్వారా ఎలాంటి పరిష్కారం కావని ప్రజలు బహిరంగంగానే వాపోయారు.స్పందన ద్వారా ఇచ్చిన అర్జీలను అధికారులు పక్కన పడేస్తారే తప్పా పరిష్కారం మాత్రం చూపడం లేదని ప్రజల నుంచి వినిపిస్తున్న మాట.స్పందన కార్యక్రమంపై ఉన్న అసంతృప్తిని తొలగించేందుకుకే దాని స్థానంలో జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తోంది.ఈ కార్యక్రమం ద్వారా వ్యక్తిగత గ్రీవెన్స్ లను అత్యంత నాణ్యతగా పరిష్కరిస్తామని జగన్ సర్కార్ చెబుతోంది.

అయితే ఇది పబ్లిసిటీ స్టంటే అనేది కొందరి అభిప్రాయం.స్పందన ద్వారా ప్రజా సమస్యలను పట్టించుకొని ప్రభుత్వం." జగనన్నకు చెబుదాం " అని పేరు మర్చినంత మాత్రాన ప్రజా సమస్యలను పరిష్కరిస్తుందా అనే ప్రశ్న ఎదురవుతోంది.

మరి ఈ కార్యక్రమం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.

కిరణ్ అబ్బవరంకు పరోక్షంగా అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పారా.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు