చంద్రబాబు యాక్షన్ ప్లాన్ షురూ చేస్తారా ?

దాదాపు 50 రోజుల పాటు జైలుకే పరిమితం అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) ఇటీవల బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.

ఆయన ఆరోగ్యనిమిత్తం నాలుగు వారాలకు గాను షరతులతో కూడిన బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది.

ఇక అధినేత బయటకు రావడంతో టీడీపీ మళ్ళీ పునర్జీవం పోసుకుంది.గత రెండు నెలలుగా హోల్డ్ లో పడిన పార్టీ కార్యకలపాలన్నీ పునః ప్రారంభించేందుకు పార్టీ శ్రేణులు ముమ్మర కసరత్తులు చేస్తున్నారు.

నారా లోకేశ్ యువగళం పాదయాత్ర తాత్కాలికంగా హోల్డ్ లో పడిన సంగతి తెలిసిందే.

Will Chandrababu Start Action Plan, Chandrababu Naidu , Nara Bhuvaneshwari ,ycp,

ఇక త్వరలోనే లోకేశ్ మళ్ళీ యువగళం పాదయాత్రలో పాల్గొనే అవకాశం ఉందట.ఇక ప్రస్తుతం నారా బ్రహ్మణితో పాటు నారా భువనేశ్వరి కూడా పాలిటిక్స్ లో యాక్టివ్ అయ్యారు.ఇక ఎన్నికల వరకు వారితో ప్రచార కార్యక్రమాలను అలాగే కొనసాగించేలా టీడీపీ( TDP ) ప్లాన్ చేస్తోందట.

Advertisement
Will Chandrababu Start Action Plan, Chandrababu Naidu , Nara Bhuvaneshwari ,ycp,

ఇక బాబు విషయానికొస్తే తనపై మోపిన అక్రమ కేసులను ప్రధానంగా ప్రస్తావిస్తూ ప్రజల్లోకి వెళ్ళి సానుభూతి సంపాదించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.అయితే చంద్రబాబుకు కోర్టు నుంచి కేవలం నాలుగు వారాల బెయిల్ మాత్రమే లభించింది.

అది కూడా ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా లభించింది.

Will Chandrababu Start Action Plan, Chandrababu Naidu , Nara Bhuvaneshwari ,ycp,

అయితే ఈ బెయిల్ ఇలాగే కొనసాగుతుందా ? లేదా బెయిల్ గడువు పూర్తి అయిన తరువాత ఆయన మళ్ళీ జైలుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయా ? అనే సందేహాలు కూడా వ్యక్తమౌతున్నాయి.అయితే ఒక్కసారి బెయిల్ రావడం వల్ల ఆ బెయిల్ ను అలాగే కొనసాగించేలా చంద్రబాబు వ్యూహాలు రచించే అవకాశం ఉంది.గతంలో వైఎస్ జగన్( YS Jagan Mohan Reddy ) విషయంలో కూడా ఇదే జరిగింది.18 నెలలు జైల్లో ఉన్నప్పటికి ఒక్కసారి బెయిల్ లభించిన తరువాత.ఆ బెయిల్ పొడిగింపు అలాగే జరుగుతూ వచ్చింది.

ఇప్పుడు చంద్రబాబు విషయంలో కూడా బెయిల్ పొడిగింపు జరిగే అవకాశాలు ఉన్నాయనేది కొందరి విశ్లేషకుల అభిప్రాయం.ఇకపోతే బయటకు వచ్చిన చంద్రబాబు జగన్ పాలనకు చెక్ పెట్టెలా యాక్షన్ ప్లాన్స్ రెడీ చేసుకునే అవకాశం ఉంది.

సంక్రాంతి నాడు గాలిపటం ఎందుకు ఎగుర వేస్తారు?

మరి బాబు ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయో చూడాలి.

Advertisement

తాజా వార్తలు