బీజేపీ హెల్ప్ టీడీపీని గట్టెక్కిస్తుందా ?

ప్రస్తుతం ఏపీ ఏదైనా హాట్ టాపిక్ ఉందా అంటే అది తెలుగుదేశం పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలే.

సరిగ్గా ఎన్నికలకు ఎనిమిది నెలల సమయం ఉండగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్( Chandrababu Naidu arrest ) కావడం, అదే విధంగా పార్టీకి నెక్స్ట్ లీడర్ అని భావించే లోకేశ్ చుట్టూ కూడా స్కామ్ ల ఉచ్చు బిగిస్తుండడంతో టీడీపీ పరిస్థితి అంధకారంలో పడింది.

అంతకు ముందు ఎన్నో కార్యక్రమాలతో తెగ హడావిడి చేసిన ఆ పార్టీ నేతలు.ఇప్పుడు దిక్కు తోచని స్థితిలో ఉండిపోయారు.

ప్రస్తుతం టీడీపీ ముందున్న ఏకైక లక్ష్యం చంద్రబాబును బయటకు తీసుకురావడం అలాగే ఈ స్కామ్ ల నుంచి వీలైనంత త్వరగా బయట పడడం.

అయితే ఇది జరిగే పనేనా అంటే కేంద్ర సహకారం ఉంటే సాధ్యమే అని అభిప్రాయాలూ వ్యక్తమౌతున్నాయి.అయితే చంద్రబాబు అరెస్ట్ అయిన తరువాత టీడీపీకి బీజేపీ( BJP ) వ్యూహాత్మకంగా దూరం పాటిస్తూవస్తోంది.ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ పెద్దల హస్తం కూడా ఉందనే వాదన బలపడుతూ వచ్చింది.

Advertisement

అయితే టీడీపీ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా కేంద్ర సహాయం కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.అమరావతి రింగ్ రోడ్ స్కామ్ లో ఇటీవల రెండు రోజులు విచారణ ఎదుర్కొన్నా నారా లోకేశ్( Nara Lokesh ) మళ్ళీ హటాత్తుగా డిల్లీ వెళ్లారు.

అక్కడ అమిత్ షాతో సమావేశం అయ్యారు.టీడీపీ నేతలపై ముఖ్యమంత్రి జగన్ వ్యవహరిస్తున్న తీరు, చంద్రబాబు నాయుడు పై అక్రమ అరెస్ట్ కేసు, తనపై జరుగుతున్నా అక్రమ విచారణ ఇవన్నీ కూడా లోకేశ్ అమిత్ షా ముందు వెళ్ళబుచ్చినట్లు తెలుస్తోంది.ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే లోకేశ్ అమిత్ షా భేటీలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి( Daggubati Purandeswari ), తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఉన్నట్లు సమాచారం.

దీంతో టీడీపీ బీజేపీ మద్య ఎలాంటి చర్చలు జరుగుతున్నాయనిది ఆసక్తికరంగా మారింది.ప్రస్తుత పరిస్థితుల నుంచి టీడీపీ గట్టెక్కాలంటే కేంద్ర పెద్దల సహకారం అవసరమైనందున టీడీపీ బీజేపీ దోస్తీ కట్టడం ఖాయమే అనే సందేహాలు కూడా వ్యక్తమౌతున్నాయి.

మరి బీజేపీ హెల్ప్ టీడీపీని గట్టెకిస్తుందో లేదో చూడాలి.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...
Advertisement

తాజా వార్తలు