చిరంజీవి గెస్ట్.. బాలయ్య హోస్ట్.. సరికొత్త ప్లాన్ చేస్తున్న 'ఆహా'!

నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) వరుస సినిమాలు చేస్తూనే ఒక టాకింగ్ షోకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించిన విషయం తెలిసిందే.

అన్ స్టాపబుల్ షోతో బాలయ్య మొదటిసారి వ్యాఖ్యాతగా మారిపోయాడు.

ఈ షో సీజన్ 1 ఘన విజయం సాధించింది.సీజన్ 1 అనుకున్న దాని కంటే ఎక్కువ విజయం సాధించడంతో పార్ట్ 2 స్టార్ట్ చేసారు.

ఆహా వారు పార్ట్ 2 కూడా గ్రాండ్ గా స్టార్ట్ చేసారు.సీజన్ 2 ఈ మధ్యనే ముగించారు.

ఇందులో పొలిటికల్ టచ్ కూడా ఇచ్చారు.రెండు సీజన్స్ గ్రాండ్ గా ముగించడంతో బాలయ్య హోస్ట్ గా కూడా సక్సెస్ అనిపించుకున్నారు.

Advertisement

ఇదిలా ఉండగా ఈ రెండు సీజన్స్ లో కూడా చిరంజీవి గెస్ట్ గా వస్తారని ఊహాగానాలు వ్యక్తం అయ్యాయి.

కానీ చిరు రెండు సీజన్స్ రాలేదు.అయితే ఇప్పుడు ఫైనల్ గా బాలయ్య హోస్ట్ గా, మెగాస్టార్ గెస్ట్( Megastar Chiranjeevi ) గా సందడి చేయబోతున్నారు అనే రూమర్స్ ఈ రోజు సోషల్ మీడియా( Social media )లో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.అయితే ఈ ఎపిసోడ్ అన్ స్టాపబుల్ సీజన్ 3 కోసం కాదని టాక్.

ముందుగా ఈ షో కోసమే ఈ ఎపిసోడ్ అనుకున్నారు కానీ మళ్ళీ అల్లు అరవింద్( Allu Aravind ) వేరేలా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.

ఈ స్పెషల్ ఎపిసోడ్ ను మరింత స్పెషల్ గా డిజైన్ చేయనున్నారని ఆహా టీమ్ మొత్తం ఇదే పనిలో ఉన్నట్టు టాక్.మరి ఎప్పటి నుండో వీరిద్దరి మధ్య బేధాభిప్రాయాలు ఉన్నాయంటూ వార్తలు రాగా ఈ ఎపిసోడ్ తో అయిన వీటికి చెక్ పడి ఇద్దరు స్నేహితులుగా మరింత స్ట్రాంగ్ గా మారుతారో లేదో చూడాలి.ఏది ఏమైనా ఈ ఎపిసోడ్ కోసం మొత్తం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich
Advertisement

తాజా వార్తలు