సీనియర్ ఎన్టీఆర్‌ని అలా చూపించి విమర్శల పాలైన డైరెక్టర్..?

సీనియర్ ఎన్టీఆర్‌( Sr NTR ) తన సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు.

పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో చక్కటి పాత్రలు చేస్తూ ప్రేక్షకులకు ఫేవరెట్ హీరో అయిపోయారు.

ఆరోజుల్లో అక్కినేని నాగేశ్వరరావు ఎన్టీఆర్ కి పోటీగా వచ్చేవారు.ఏఎన్నార్‌ తన సినిమాల్లో డాన్సులు చేస్తూ ఆడియన్స్‌కు హుషారెత్తించేవారు.

ఎన్టీఆర్‌ మాత్రం డాన్సులు చేయడంలో వెనుకబడేవారు.కానీ డైరెక్టర్‌ కె.బాపయ్య( Director K.Bapayya ) సీనియర్ ఎన్టీఆర్ లో కూడా రొమాంటిక్ డాన్సర్‌ ఉన్నాడని ప్రేక్షకులకు చూపించాలనుకున్నాడు.1970లో ‘ద్రోహి’ చిత్రంతో డైరెక్టర్‌గా పరిచయమైన బాపయ్య ‘మేమూ మనుషులమే’ మూవీతో మంచి హిట్ అందుకున్నాడు.కొద్ది రోజులకు బాపయ్య ఎన్టీఆర్‌తో కలిసి ‘ఎదురులేని మనిషి (1975)’( Eduruleni Manishi ) సినిమా తీసే ఛాన్స్ పట్టేసాడు.

సి.అశ్వినీదత్‌ దీనికి నిర్మాత.ఈ మూవీ స్టార్ట్ అయిన మొదటి రోజు నుంచే బాపయ్యపై తీవ్ర విమర్శలు రావడం మొదలయ్యాయి.

Advertisement

ఇందులో నటించిన యాక్టర్లు, ఈ మూవీ కోసం పనిచేసిన టెక్నీషియన్లు అందరూ కూడా ఆయనను బాగా విమర్శించారు.ఎందుకంటే ఎన్టీఆర్‌కి ఉన్న ఇమేజ్‌ను చెడగొట్టేలాగా కాస్ట్యూమ్స్‌ నుంచి అన్నింటిలో మార్పులు తీసుకొచ్చాడు బాపయ్య.

‘ఆ డ్రెస్సులు, ఆ పాటలు అసలు బాగోలేదు.ప్రేక్షకులు రామారావుని అలా చూడటానికి ఇష్టపడరు.’ అని దర్శకుడు బాపయ్య ఎదుటనే చాలామంది విమర్శించారట.

ఈ విషయాన్ని ఆయనే తెలిపాడు.ఈ సినిమా తీస్తున్న సమయంలో ఓ రోజు షూటింగ్‌ డ్రెస్‌లోనే ఎన్టీఆర్ ఇంటికి వెళ్లారు.

అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అతన్ని చూసి ‘మీరేంటి.మీ డ్రెస్‌ ఏంటి’ అని షాకింగ్గా అడిగారట.

ఎంత ప్రయత్నించినా జుట్టు రాలడం ఆగట్లేదా.. అయితే మీరు ఇది ట్రై చేయాల్సిందే!

రామారావు మాత్రం "కొత్తగా ఏదో ట్రై చేస్తున్నాం, పర్లేదు.చూద్దాం.

Advertisement

" అని అన్నారు కానీ బాపయ్యను ఎప్పుడూ కూడా ఆయన ప్రశ్నించలేదట.ఈ సినిమాలో ‘కసిగా ఉంది.

కసికసిగా ఉంది.’ పాట ఉంటుంది.

దీన్ని ఆత్రేయ రాశారు.ఎన్టీఆర్ మునుపెన్నడూ ఇలాంటి హాట్ సాంగ్‌లో నటించలేదు.

ఈ సాంగ్ షూట్‌ చేస్తున్న సమయంలో కెమెరామెన్‌ వెంకటరత్నం సైతం బిత్తరపోయాడట.‘ఆ పాటేంటండీ.

’ అని బాపయ్య అసిస్టెంట్స్‌ ముందు అసహనాన్ని వ్యక్తం చేశాడు.

ఆ పాటలో యాక్ట్‌ చేస్తూనే వాణిశ్రీ( Vanisri ) ఇలాంటి పాటలు ఎలా చేస్తారంటూ విమర్శించిందని స్వయంగా కె.బాపయ్య చెప్పాడు.మిగతా టెక్నీషియన్స్‌ కూడా రామారావుగారిని అలా చూపించి పెద్ద తప్పు చేస్తున్నావ్ అంటూ హెచ్చరించారట.

ఇక ఈ సినిమా గురించి మిగతా వారందరికీ తెలియడం వారు కూడా విమర్శలు చేయడం జరిగింది.కొంతమంది అయితే ఫోన్లు కూడా చేసి జాగ్రత్త బాపయ్య అని చెప్పారట.

ప్రివ్యూ వెయ్యొద్దు అని కూడా సలహా ఇచ్చారట.చివరికి ప్రివ్యూ వెయ్యకుండానే ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ చేశారు.

ఎదురులేని మనిషి రిలీజ్ అయిన మొదటి రోజు ఆయనకు చాలామంది ఫోన్ చేసి పాటలు బాగున్నాయని ప్రేక్షకులు పొగుడుతున్నట్లుగా వెల్లడించారు.కసిగా ఉంది, కసి కసిగా ఉంది పాటపై కూడా ఎలాంటి విమర్శలు రావడం లేదని చెప్పడంతో బాపయ్య ఊపిరి పీల్చుకున్నాడు.

ఈ సినిమా సూపర్ హిట్ అయింది.ఆయనే తీసిన సోగ్గాడు సినిమా వారం రోజుల తర్వాత విడుదలై అది కూడా బంపర్ హిట్ అయింది.

దాంతో బాపయ్య ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ అయిపోయాడు.

తాజా వార్తలు