షారుఖ్ ఖాన్ ఎందుకు సౌత్ డైరెక్టర్ల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నాడు..?

ప్రస్తుతం బాలీవుడ్ హీరోలందరూ కూడా సౌత్ సినిమా దర్శకుల వెంట పడుతున్నారు.వాళ్ళతో ఒక్క సినిమా అయిన చేయాలని చాలా ఉత్సాహం చూపిస్తున్నారు.

ఎందుకంటే బాలీవుడ్ దర్శకులు ఎవరు కూడా వాళ్లకు సక్సెస్ లను అందించడం లేదు.కేవలం సౌత్ సినిమా దర్శకులు( South Directors ) మాత్రమే వాళ్లకు ఎక్కువ సక్సెస్ లను అందించే విధంగా ముందుకు సాగుతున్నారు.

ఇక ప్రస్తుతం పాన్ ఇండియాలో సౌత్ ఇండియన్ దర్శకుల హవా నే ఎక్కువగా కొనసాగుతుంది.దాని వల్ల ఆయన సౌత్ సినిమా దర్శకుల పైన ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడు.

ఇక ఇప్పటికే తమిళ్ సినిమా డైరెక్టర్ అయిన అట్లీ తో( Atlee ) జవాన్( Jawan Movie ) అనే సినిమా చేసి సక్సెస్ ని సాధించాడు.ఇక ఇప్పుడు కూడా ఇలాంటి క్రమంలోనే మరి కొంతమంది సౌత్ దర్శకుల మీద ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

Advertisement

ఇక లోకేష్ కనకరాజ్( Lokesh Kanagaraj ) డైరెక్షన్ లో సినిమా చేయడానికి ఆయన ఇంట్రెస్ట్ చూపించినప్పటికీ లోకేష్ ప్రస్తుతం బిజీగా ఉండడం వల్ల వేరే దర్శకులతో సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.ఇక అందులో భాగంగానే తెలుగులో కొంతమంది దర్శకుల పేర్లు కూడా వినిపిస్తున్నప్పటికీ వాళ్ళు కూడా తమ సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల షారూక్ తో( Shahrukh Khan ) సినిమా చేసే అవకాశాలైతే లేనట్టుగా తెలుస్తున్నాయి.

ఇక కొరటాల శివ( Koratala Siva ) దర్శకత్వంలో ఆయన నటించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్టుగా కొరటాల సినిమా చేస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉండి.ఇక దేవర తర్వాత కొరటాల శివ కూడా తన తర్వాత సినిమా ఎవరితో చేస్తున్నాడో ఇంకా క్లారిటీ లేదు.కాబట్టి దేవర రిలీజ్ అయిన తర్వాత షారుక్ ఖాన్ తో సినిమా చేస్తాడా లేదా అనే విషయం మీద క్లారిటీ వస్తుందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు