రవితేజ మరో సినిమా క్యాన్సిల్డ్‌.. ఇలా అయితే కొనసాగడం కష్టమే..??

ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా చలనచిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా ఎదగడం అనేది అంత సులభమైన పని కాదు.

ముఖ్యంగా కెరీర్ తొలినాళ్లలో చాలా కష్టమైపోతుంది.

మంచి మూవీ సెలక్షన్ నుంచి సినిమా పూర్తయ్యే వరకు అన్ని సవాళ్లు ఎదురవుతాయి.వాటన్నిటినీ దాటుకుని పోయిన వాళ్లు కొందరే ఉన్నారు.

అలాంటి వారిలో మాస్ మహారాజా రవితేజ ఒకరు.ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, ఖడ్గం, వెంకీ, విక్రమార్కుడు, ధమాకా వంటి హిట్ సినిమాలతో రవితేజ స్టార్ హీరోగా ఎదిగాడు.

ఆయన సినిమా సినిమాలు ఇప్పుడు పెద్దగా హిట్ కావట్లేదు కానీ ఒకప్పుడు రవితేజ( Ravi Teja ) తీసిన అన్ని సినిమాలు కూడా వరుసగా హిట్స్ అయ్యేవి.అయితే మాస్ మహారాజా అభిమానులు హిట్టు, ఫ్లాప్ తో సంబంధం లేకుండా అతను స్క్రీన్ మీద కనిపిస్తే చాలు అనుకునేవారు.

Advertisement

ఇప్పటికీ రవితేజ సినిమా కోసం వెయిట్ చేసేవాళ్లు చాలా మందే ఉన్నారు.

రవితేజ పాటలు, యాక్షన్, డైలాగులు, కామెడీ ఇలా అన్నిటిలో అద్భుతంగా రాణిస్తాడు.అందుకే అతని సినిమా ద్వారా ఫ్యాన్స్‌కి బీభత్సమైన ఎంటర్‌టైన్‌మెంట్ లభిస్తుందని నిస్సందేహంగా చెప్పవచ్చు.ఇప్పుడు ఈ మాస్ హీరో మిస్టర్ బచ్చన్ అనే ఓ సినిమాలో నటిస్తున్నాడు.

రవితేజ హీరోగా వస్తున్న ఈ మూవీ త్వరలోనే రిలీజ్ అయ్యే అవకాశం.అయితే అతని దురదృష్టం ఏంటో కానీ ఇటీవల కాలంలో రవితేజ సంతకం చేసిన ప్రాజెక్టులు రద్దు అవుతున్నాయి.

కొద్ది రోజుల క్రితం గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన సినిమా సూపర్ ఫ్లాప్ అయ్యింది.

వైరల్ వీడియో : విజయం అంటే ఇది.. అమ్మ కళ్లలో ఆనంద బాష్పాలు..
భారతీయుడు 2 ప్లాప్ తో వణికిపోతున్న దిల్ రాజు...కారణం ఏంటంటే..?

అనుదీప్( Anudeep Kv ) డైరెక్షన్ లో ఒక రవితేజ హీరోగా ఒక సినిమా రాబోతుందంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వచ్చాయి.అయితే లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఆ సినిమా కూడా ఆగిపోయింది దానికి గల కారణాలు ఏంటో తెలియ రాలేదు.ప్రస్తుతం అనుదీప్, విశ్వక్ సేన్ ఒక సినిమా విషయంలో చర్చలు జోరుగా కొనసాగిస్తున్నట్లు.

Advertisement

విశ్వక్ సేన్‌కు స్టోరీ నచ్చితే వారిద్దరి కాంబినేషన్‌లో ఒక సినిమా వచ్చే అవకాశం ఉంది.మరోవైపు రవితేజ సినిమాలు ఎందుకు క్యాన్సల్ అవుతున్నాయో అర్థం కాని పరిస్థితి.

కెరీర్ తొలినాళ్లలో చాలామంది కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చిన ఆయన ఇప్పుడు మాత్రం రిస్క్ చేయలేకపోతున్నాడు.సినిమాలను కూడా కంప్లీట్ చేయలేక ముందుగానే వదిలేస్తున్నాడు.దానికి గల కారణాలు ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

తాజా వార్తలు