5-రోజుల షూటింగ్ తర్వాత రకుల్‌ని తొలగించిన మిస్టర్ పర్ఫెక్ట్ డైరెక్టర్..??

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్, తాప్సీ పన్ను నటించిన రొమాంటిక్ డ్రామా ఫిల్మ్ "మిస్టర్ పర్ఫెక్ట్ (2011)( Mr.Perfect )" సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

దశరధ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.

ఇందులోని పాటలు చాలా బాగుంటాయి.చలి చలిగా, నింగి జారిపడ్డ, అగ్గిపుల్ల లాంటి పాటలు సూపర్ హిట్స్ అయ్యాయి.ఈ పాటల్లో కాజల్ అగర్వాల్ చాలా ముద్దుగా కనిపించింది.

ఆమె కోసమే ఈ పాటలు మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది.ఈ మూవీలో ప్రియ/అమ్ములుగా కాజల్ అగర్వాల్( Kajal Aggarwal ) బాగా సూట్ అయింది.

Why Rakul Removed From Mistar Perfect ,mr Perfect , Rakul Preet Singh, Kajal

అయితే కాజల్ ఇతర క్యారెక్టర్స్ కు పర్ఫెక్ట్ గా సూటైనా ఇందులోని ప్రియ రోల్ కు సూట్ కాదని డైరెక్టర్ అనుకున్నాడు.అందుకే హీరోయిన్ కోసం అన్వేషణ చేస్తున్నప్పుడు హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ అని అనుకోలేదు.ముందుగా రకుల్ ప్రీత్‌ సింగ్ ని హీరోయిన్ గా తీసుకోవాలని భావించాడు.

Advertisement
Why Rakul Removed From Mistar Perfect ,Mr Perfect , Rakul Preet Singh, Kajal

అందుకే ఆమెకు కథ కూడా చెప్పాడు.స్టోరీ నచ్చడంతో రకుల్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా అనేది హీరోయిన్ చుట్టే తిరుగుతుంది.అందువల్ల ముందుగా రకుల్ తోనే సన్నివేశాలు షూట్ చేయడం ప్రారంభించారు.

ఐదు రోజులు షూట్ చేసిన తర్వాత ఔట్ పుట్ చెక్ చేసుకుంటే రకుల్ ఆ పాత్రలో ఏ మాత్రం బాగా చేయలేదు.

Why Rakul Removed From Mistar Perfect ,mr Perfect , Rakul Preet Singh, Kajal

ఆమె సన్నగా ఉండటం వల్ల ప్రియ లేదా అమ్ములు పాత్రకు సరిగ్గా సూట్ కాలేకపోయింది.దీంతో డైరెక్టర్ కూడా డిస్పాండ్ అయ్యాడు. మూవీ టీమ్ అంతా కూడా పెదవి విరిచింది.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు

ఆ సమయంలో ఈ మూవీ నిర్మాత దిల్ రాజ్‌ డార్లింగ్ సినిమాలో ప్రభాస్ సరసన కాజల్ చాలా బాగా సూట్ అయింది, ఈ సినిమాలో కూడా ఆమెనే తీసుకుంటే బాగుంటుంది అని సలహా ఇచ్చాడు.దశరధ్( Dasaradh ) కూడా చివరికి ఆమే ఈ పాత్రకి బాగా సరిపోతుందని భావించాడు.

Advertisement

అనంతరం ఆమెతో సన్నివేశాలు చేయగా ఔట్ పుట్ అదిరిపోయింది.దాంతో ఆమెనే కంటిన్యూ చేశారు.

కాజల్ అగర్వాల్ పర్ఫామెన్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయింది.ఈ చిత్రం 2011, ఏప్రిల్ 22న థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

దీన్ని బెస్ట్ తెలుగు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సినిమా క్రిటిక్స్ పొగిడారు.

తాజా వార్తలు