వినాయకుడి ముందు గుంజీలు ఎందుకు తీయాలి?

వినాయకుడికి ముందుగా పూజ చేశాకే.మిగతా పనులు మొదలు పెడ్తుంటారు చాలా మంది.

అలాగే విఘ్నాలు తొలగించే ఈ విఘ్నేశ్వరుడి ముందు గుంజీలు కూడా తీస్తుంటాం.అయితే అలా ఎందుకు చేస్తామో మాత్రం ఎవరికీ తెలియదు.

మనకు చాలా సార్లు అలా ఎందుకు చేయాలనే డౌట్ వచ్చినా.సమాధానం తెలియక సైలెంట్ గా ఉండిపోతాం.

అయితే వినాయకుడి ముందు గుంజీలు ఎందుకు తీయాలి, గణేషుడికి భక్తులు గుంజీలు తీయడం ఇష్టమా అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.గణపతికి గుంజీలు తీసి నమస్కారం చేయడం అనాదిగా వస్తోంది.

Advertisement
WHY PUT GUNJEELU IN FRONT OF GANESHA, Ganesh , Pooja , Devotional , Maha Vishnuv

అయితే శ్రీహరి ఒకానొకప్పుడు కైలాసానికి వెళ్లాడు.మర్యాదలన్నీ అయిన తర్వాత శివ కేశవులిద్దరూ ముచ్చట్లాడుకుంటూ కూర్చున్నారు.

ఇంతలో గణపతి అక్కడకు వచ్చాడు.శ్రీ హరి చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని చూశాడు.

అది విఘ్నేశ్వరుడికి విచిత్రంగా కనిపించింది.చాలా బాగా నచ్చింది.

వెంటనే దాన్ని లాక్కొని నోట్లో పెట్టేసుకున్నాడు.శ్రీ మహా విష్ణువు ఎంత బతిమాలినా వినాయకుడు చక్రం ఇవ్వలేదు.

Why Put Gunjeelu In Front Of Ganesha, Ganesh , Pooja , Devotional , Maha Vishnuv
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 29, మంగళవారం 2025

ఏం చేయాలో ఎవరికీ పాలుపోలేదు.అయితే వెంటనే శ్రీహరికి ఒక ఉపాయం వచ్చింది.వెంటనే తన రెండు చెవులను రెండు చేతులతో పట్టుకొని గుంజీళ్లు తీయడం మొదలు పెట్టాడు.

Advertisement

శ్రీహరి చేసే ఈ విచిత్రమైన ఆట గణపతికి చాలా బాగా నచ్చింది.ఆ ఆటను చూస్తూ.ఒకటే నవ్వడం మొదలు పెట్టాడు.

అలా అతడి నోట్లో ఉన్న విష్ణు చక్రం కింద పడి పోయింది.అయితే గణపతి గురించి సాక్ష్యాత్తు శ్రీ మహా విష్ణువే గుంజీలు తీయడం గమపతికి చాలా నచ్చింది.

అప్పటి నుంచి భక్తులు కూడా వినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు గుంజీలు తీయడం ప్రారంభించారు.

" autoplay>

తాజా వార్తలు