బాలయ్య అవకాశాన్ని యూజ్ చేసుకోలేకపోయిన నిర్మాతలు..

పవిత్ర ప్రేమ.బాలయ్య నటించిన సినిమా.

ఈ సినిమాకు ఓ రోజు ప్రివ్యూ షో నిర్వహించారు.

ఈ షో కోసం చాలా మంది సినీ ప్రముఖులు వచ్చారు.

ఎప్పుడూ ప్రివ్యూ షోలకు రాని బాలయ్య కూడా వచ్చాడు.సినిమా మొదలయ్యింది.

చాలా మందికి ఈ సినిమా అంతంత మాత్రంగానే నచ్చింది.కొంత మంది మధ్యలో లేచి వెళ్లిపోతున్నారు.

Advertisement
Why Producers Are Not Utilizing Balakrishna Offer , Balakrishna, Chanti, Sriniva

ఉన్న వాళ్లు కూడా అంత ఇంట్రెస్టుగా సినిమా చూసినట్లు అనిపించడం లేదు.ఇలాంటి సినిమాలు మనవాళ్లు చూడరండీ అనే కామెంట్లూ వినిపిస్తున్నాయి.

ఈ సినిమా నిర్మాతలు చంటి, శ్రీనివాస్ రెడ్డిలో చాలా టెన్షన్ కనబడుతుంది.దూరంగా వెళ్లి కూర్చుని ఎలా అనే ఆలోచన చేస్తున్నారు.

ఈ సినిమా ఫ్లాప్ అయితే మనకు ఇబ్బందులు తప్పవు అనే రీతిలో చర్చించుకుంటున్నారు.ఇంతలో వారి దగ్గరికి ఎవరో వచ్చినట్లు అనిపించింది.

చంటి వీపు మీద ఓ చేయి పడింది.తలెత్తి చూస్తే బాలయ్య.

మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు ఉన్నవాళ్లు దీన్ని తింటే ఏమవుతుందో తెలుసా..?

నవ్వుతూ కనిపించాడు.నిర్మాతలతో ఓ మాట అన్నాడు.

Advertisement

మీరు ఏం టెన్షన్ పడకండి.మన సినిమా సూపర్ హిట్ అవుతుందని అని ధైర్యం చెప్పాడు.

మీ తర్వాత సినిమాకు కూడా నేనే డేట్లు ఇస్తున్నా అన్నాడు బాలయ్య.ఆయన మాటలో నిర్మాతలకు కొండంత ధైర్యం వచ్చింది.

బాలయ్య చెప్పినట్లు గానే సినిమా విడుదల అయ్యింది.జనాల్లోకి అద్భుతంగా వెళ్లింది.

పవిత్ర ప్రేమ ఓ రేంజిలో హిట్ కొట్టింది.ఈ సినిమా విజయంతో ఎంతో ఉత్సాహ పడ్డారు సినిమా నిర్మాతలు.

బాలయ్యతో మరో సినిమాకు రెడీ అయ్యారు.దర్శకుడిగా ముత్యాల సుబ్బయ్యను ఓకే చేశారు.

కథ ఓకే అయ్యింది.ఈ సినిమాకు కృష్ణబాబు అనే పేరు పెట్టారు.

కీలక పాత్రల్లో అబ్బాస్, మీనా, రాశీని సెలెక్ట్ చేశారు.నిర్మాతల మీద నమ్మకంతో బాల్య కథను కూడా వినలేదు.

బాలయ్య ఎంతో మంచి అవకాశాన్ని ఇచ్చినా నిర్మాతలు యూజ్ చేసుకోలేకపోయారు.బాలయ్య సినిమా కొనసాగుతున్న సమయంలోనే మరో సినిమా నిర్మాణానికి ఓకే చెప్పారు.దీంతో బాలయ్య సినిమాపై అంతగా కాన్సట్రేట్ చేయలేకపోయారు.

అంతేకాదు.ఈ సినిమా మిక్సింగ్ సమయంలో ఎన్నో పొరపాట్లు చేశారు.

థియేటర్లో సౌండ్ చాలా తేడాగా వచ్చింది.సరిగ్గా మాటలు వినపడలేదు.

జనాలు బాగా అల్లరి చేశారు.ఈ సినిమా విషయంలో జరిగిన పొరపాట్లపై ఆయన చాలా ఫీలయ్యాడు.

కానీ నిర్మాతలను ఒక్క మాట కూడా అనలేదు.జరిగిన పొరపాటుకు నిర్మాతలు చాలా బాధపడ్డారు.

తాజా వార్తలు